Multibagger Stocks: రూ.లక్ష పెట్టుబడితో రూ.70 లక్షలు.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌తో కోట్లకు అధిపతి కావొచ్చు..!

Multibagger Stocks: Multibagger Stocks: స్టాక్ మార్కెట్‌లో ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. అయితే, ఇది చాలాకాలం పడుతుంది. నిపుణులను సంప్రదించి సరైన నిర్ణయం తీసుకుంటే భారీ లాభాలు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు..

Update: 2023-06-06 14:30 GMT

Multibagger Stocks: స్టాక్ మార్కెట్‌లో ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. అయితే, ఇది చాలాకాలం పడుతుంది. నిపుణులను సంప్రదించి సరైన నిర్ణయం తీసుకుంటే భారీ లాభాలు అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.. అయితే, ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మల్టీబ్యాగర్ స్టాక్స్ ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉంటాయి. చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందుకోవచ్చు.

మల్టీబ్యాగర్ స్టాక్స్ లాభాలు అందించాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. షార్ట్ టర్మ్‌లో ఇవి ఎక్కువ లాభాలు ఇవ్వలేవు. ఆల్కైల్ అమిన్స్ కెమికల్స్ లిమిటెడ్ పెట్టుబడి దారులకు అద్భుతమైన లాభాలు అందించింది. గత 10 సంవత్సరాలలో ఈ కంపెనీ షేర్ 7,500 శాతానికి పైగా పెరిగింది. అంటే ఒక ఇన్వెస్టర్ దశాబ్దం క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష సేవింగ్ చేస్తే.. ప్రస్తుతం ఆ విలువ రూ.70 లక్షలకు చేరుకుని, బంఫర్ లాభాలు ఇచ్చేది.

అద్భుత లాభాలు..

గత మూడేళ్లలో ఈ స్టాక్ ధర 366 శాతం పెరిగింది. అలాగే 5 ఏళ్లలో 878 శాతం పెరిగి, బంఫర్ లాభాలు అందించింది. శుక్రవారం ఈ కంపెనీ షేర్ ధర రూ.2,441.35 వద్ద నమోదైంది.

(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం గత పనితీరును బట్టి అందించాం. అయితే, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి అనేది రిస్క్‌తో కూడుకున్నది. నిపుణుల సలహాలు తీసుకుని, సరైన నిర్ణయం తీసుకుని నష్టాల నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది)

Tags:    

Similar News