దీపావళి నుండి దేశంలో జియో 5జీ సేవలు.. ముఖేష్ అంబానీ కీలక ప్రకటన!
JIO 5G: ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం) కొనసాగుతుంది.
JIO 5G: ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం) కొనసాగుతుంది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగంలో 5జీ నెట్ వర్క్ గురించి అంబానీ కీలక వ‍్యాఖ్యలు చేశారు. ముందుగా ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5G అందుబాటులోకి వస్తుందని ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఎటువంటి వైర్లు లేకుండా అందించే ఈ సేవలను జియో ఎయిర్ ఫైబర్‌గా నామకరణం చేసినట్టు జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు.