డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఆసక్తి చూపిస్తున్న ముఖేష్ అంబానీ
Mukesh Anmbani: భారతదేశంలో టెలికాం ఇండస్ట్రీని జియో కి ముందు జియో తర్వాత అని చెప్పుకోవచ్చు. అంతగా టెలికామ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది రిలయన్స్ జియో.
Mukesh Anmbani: భారతదేశంలో టెలికాం ఇండస్ట్రీని జియో కి ముందు జియో తర్వాత అని చెప్పుకోవచ్చు. అంతగా టెలికామ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది రిలయన్స్ జియో. అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా అంటూ భారతదేశంలోని టెలికం ఇండస్ట్రీలోని ఒక కొత్త శకానికి తెర లేపింది ముఖేష్ అంబానీ అని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఇప్పుడు ముఖేష్ అంబానీ డిజిటల్ ప్లాట్ఫాం పైన ఆసక్తి చూపిస్తున్నారు. అతి త్వరలోనే ముఖేష్ అంబానీ సొంతంగా ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ లాంచ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
జియో డిజిటల్ బిజినెస్ స్ట్రాటజీ లో భాగంగా డిజిటల్ మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ పెద్ద పీట ఉంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ మీడియా బిజినెస్ ని డెవలప్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే రిలయన్స్ వారు ఒక కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అయితే ఇప్పటికే చాలా కంటెంట్ కంపెనీలు మరియు ప్రొడక్షన్ బ్యానర్లు రిలయన్స్ తో కొలాబోరెట్ అవ్వాలని ఆసక్తి చూపించారని వారి కోసమే తాము ఓటీటీలో ముందడుగు వేస్తున్నామని తెలిపారు రిలయన్స్ వారు. ఇప్పటికే వయాకమ్ 18 మరియు జియోసినిమా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ ఈసారి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాగా పెద్ద స్థాయిలో ఓటీటీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.