Mark Zuckerberg: భార్యకు జుకర్‌బర్గ్ స్పెషల్ గిఫ్ట్.. ఫోటోలు వైరల్..!

Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ తన భార్య ప్రిన్సిల్లాకు రోమన్ కల్చర్‌లో శిల్పాన్ని చెక్కించి బహుమతిగా ఇచ్చారు.

Update: 2024-08-14 10:36 GMT

Mark Zuckerberg

Mark Zuckerberg:ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మరోసారి వార్తల్లో నిలిచారు. భార్య ప్రిస్సాలా చానుపై తనకున్న ప్రేమను వినూత్న రీతిలో చాటుకున్నారు. ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే కానుకను అందించారు. రోమన్ కల్చర్‌లో ఆమె శిల్పాన్ని చెక్కించి బహుమతిగా ఇచ్చారు.

ఈ శిల్పాన్ని ఇంటి వెనుక ఉన్న గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను జుకర్‌బర్గ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ విగ్రహం ఎదుట కాఫీ తాగుతూ ప్రిన్సిల్లా ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోల ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ శిల్పాన్ని న్యూయార్క్ నగరానికి చెందిన ప్రసిద్ధ కళాకారుడు డేనియల్ అర్షమ్ రూపొంచారు.

జుకర్‌బర్గ్-   హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో ప్రేమించుకున్నారు. వీరి వివాహం 2012 మే 19న జరిగింది. ఈ జంటకు ముగ్గురు సంతానం. 2015లో అమ్మాయి మాక్సిమా చాన్ జన్మించింది. ఆ తర్వాత ఆగస్టు 2017లో ‘ఆగస్ట్’ జన్మించింది. 2023 మార్చిలో మరో పాప అరేలియా జన్మించింది.


Tags:    

Similar News