అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. గమనించకుంటే అంతే సంగతులు..!

October 1: అక్టోబర్‌ నెల ప్రారంభంకాగానే కొన్ని ప్రధాన విషయాలలో మార్పులు సంభవిస్తున్నాయి.

Update: 2022-09-28 06:28 GMT

అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. గమనించకుంటే అంతే సంగతులు..!

October 1: అక్టోబర్‌ నెల ప్రారంభంకాగానే కొన్ని ప్రధాన విషయాలలో మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా డీమ్యాట్ ఖాతా, LPG సిలిండర్, క్రెడిట్ కార్డ్ ధరలకు సంబంధించిన విషయాలలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఈ విషయాలని గమనించకుంటే వినియోగదారులు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే వీటిపై ఓ లుక్కేయండి.

1. క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించి కొన్ని మార్పులు చేయనుంది. కార్డ్-ఆన్-ఫైల్ టోకనైజేషన్ (CoF కార్డ్ టోకనైజేషన్) నియమం అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ విధానంలో వీసా, మాస్టర్ కార్డ్ వంటి పెద్ద నెట్‌వర్క్‌లకు టోకెన్ నంబర్ జారీ అవుతుంది. ఈ సదుపాయం వినియోగదారులకు పూర్తిగా ఉచితంగా లభిస్తుంది.

2. డీమ్యాట్ మార్పు

అక్టోబర్ 1 నుంచి ట్రెండింగ్ అకౌంట్‌ని ఉపయోగించడానికి ఒక పనిచేయాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతా లాగిన్ కోసం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేయాలి. అలా చేయకపోతే మీరు ఖాతాను ఉపయోగించలేరు. ప్రతి డీమ్యాట్ ఖాతాదారు ముందుగా తన బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందని, రెండో ప్రామాణీకరణ కోసం పాస్‌వర్డ్‌ను ఉపయోగించవచ్చని NSE ఆదేశాలు జారీ చేసింది.

3. ఎల్‌పిజి

ప్రతి నెల మొదటి తేదీ గ్యాస్‌ ధరలలో మార్పులు జరుగుతాయి. సెప్టెంబరులో కమర్షియల్ గ్యాస్ ధర కొద్దిగా తగ్గినప్పటికీ ఎల్‌పిజి ధరలలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు అక్టోబర్ నెలలో పండుగలని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు గ్యాస్ ధరను తగ్గించవచ్చని అందరు భావిస్తున్నారు.

Tags:    

Similar News