Investment Plan: ఈ పద్ధతిలో ఇన్వెస్ట్‌ చేయండి.. సులువుగా కోటీశ్వరులవుతారు..!

Investment Plan: భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెట్టాలంటే SIP (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్లాన్‌) ఉత్తమ ఎంపికని చెప్పవచ్చు.

Update: 2023-10-03 15:30 GMT

Investment Plan: ఈ పద్ధతిలో ఇన్వెస్ట్‌ చేయండి.. సులువుగా కోటీశ్వరులవుతారు..!

Investment Plan: భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెట్టాలంటే SIP (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్లాన్‌) ఉత్తమ ఎంపికని చెప్పవచ్చు. ఒక క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మీ లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటారు. మ్యూచువల్ ఫండ్ SIPలో ప్రతి నెలా రూ.10,000 ఇన్వెస్ట్‌ చేస్తే 15 సంవత్సరాలలో మిలియనీర్ అవుతారు. దీని కోసం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్స్ 15 x 15 x 15 నియమం

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా అత్యంత వేగంగా మిలియనీర్‌గా మారవచ్చు. ఇందులో15 x 15 x 15 నియమం ప్రకారం పెట్టుబడిదారుడు 15 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.15,000 పెట్టుబడి పెట్టడం వల్ల సంవత్సరానికి కనీసం 15 శాతం రాబడిని ఆశించవచ్చు. మీరు 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టినట్లయితే ఇది సులువగా సాధ్యమవుతుంది. అయితే నెలకు రూ.10,000 పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా దీన్ని సాధ్యం చేసుకోవచ్చు.

SIP ప్లాన్‌

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేయడం వల్ల రూ.1 కోటి రాబడి పొందవచ్చు. నెలవారీ సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రజలు నిర్దిష్ట సమయం తర్వాత SIP ద్వారా సేకరించిన మొత్తాన్ని విత్‌డ్రా చేస్తారని సర్వే వెల్లడించింది. కొన్నిసార్లు SIP మొత్తాన్ని కూడా తగ్గిస్తారు. అందుకే పెట్టుబడి దారులు ఆదాయం పెరిగే కొద్దీ నెలవారీ SIPని పెంచాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే వడ్డీపై వడ్డీ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనినే కాంపౌండింగ్ బెనిఫిట్ అంటారు.

SIP కాలిక్యులేటర్

ఒక ఇన్వెస్టర్ ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెట్టి 15 సంవత్సరాల పాటు 10 శాతం వార్షిక వృద్ధిని కొనసాగిస్తే SIP కాలిక్యులేటర్ ప్రకారం రూ.1,03,11,841 (రూ.1.03 కోట్లు) వస్తుంది.

Tags:    

Similar News