Investment Plan: 21 ఏళ్ల వయసులో పిల్లల్ని కోటీశ్వరులను చేయండి.. ఇలా ప్లాన్ చేస్తే వర్కవుట్ అవుతుంది..!
Investment Plan: పిల్లల్ని కనడం గొప్పకాదు వారికి సరైన జీవితాన్ని ఇచ్చినప్పుడే ఉత్తమ తల్లిదండ్రులు అవుతాం. పిల్లల భవిష్యత్ గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తారు.
Investment Plan: పిల్లల్ని కనడం గొప్పకాదు వారికి సరైన జీవితాన్ని ఇచ్చినప్పుడే ఉత్తమ తల్లిదండ్రులు అవుతాం. పిల్లల భవిష్యత్ గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ ఆచరణలో పెట్టేది కొంతమంది మాత్రమే. వారు పెద్దయ్యాక వారి చదువు నుంచి పెళ్లి వరకు ప్రతిదానికీ ముందుగానే ఆర్థిక ప్రణాళికను ప్రారంభించాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. 21 సంవత్సరాల వయస్సులో పిల్లలను రూ. 2 కోట్లకు పైగా యజమానిని చేయగల పెట్టుబడి పథకం ఒకటి ఉంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ప్రతి నెలా రూ.10,000 డిపాజిట్
మీరు 21 సంవత్సరాల వయస్సులో మీ బిడ్డకు రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఇవ్వాలంటే ప్రతి నెలా రూ.10,000 సిప్‌లో పెట్టుబడి పెట్టాలి. దీంతో 21 ఏళ్లలో పిల్లల పేరిట రూ.25.20 లక్షలు డిపాజిట్ అవుతాయి. ఇప్పుడు SIPపై 16 శాతం రాబడిని పొందుతారని అనుకుందాం. 21 ఏళ్లు పూర్తయిన తర్వాత రూ. 2.06 కోట్ల మొత్తాన్ని పొందుతారు. పిల్లల పేరు మీద జమ చేసిన రూ.25.20 లక్షలు మీకు 21 ఏళ్లలో రూ.1.81 కోట్ల సంపాదనను తెచ్చిపెడుతాయి. బిడ్డకు 21 ఏళ్లు నిండిన తర్వాత ఈ మొత్తాన్ని చదువు, వివాహం లేదా వ్యాపారంలో పెట్టుబడి కోసం ఉపయోగించవచ్చు.
ఒకవేళ 12% వడ్డీ మాత్రమే లభిస్తే
మీరు SIPలో 16% వడ్డీని పొందలేదనుకుందాం. 12% వడ్డీని మాత్రమే పొందారని అనుకుందాం. అప్పుడు కూడా మీరు మీ పెట్టుబడికి చింతించాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంలో కూడా మీ బిడ్డకు రూ. 25.20 లక్షల పెట్టుబడిపై రూ. 88.66 లక్షల రాబడి వస్తుంది. అతని వద్ద మొత్తం రూ.1.13 కోట్లు ఉంటుంది.