Pradhan Mantri Aawas Yojana: రూ.9 లక్షలకే శాటిలైట్ టౌన్‌షిప్‌లో ప్లాట్.. లాటరీ తగిలితే లక్కీ ఛాన్స్.. ఎక్కడో తెలుసా?
MHADA Lottery 2023: 2023లో రెండవ సారి మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (MHADA) కొంకణ్ బోర్డ్ థానే, పాల్ఘర్, రాయ్‌ఘడ్ జిల్లాలతో సహా ముంబైకి సమీపంలోని శాటిలైట్ టౌన్‌షిప్‌లో 5,311 సరసమైన గృహాలను విక్రయించడానికి లాటరీని ప్రకటించింది.
MHADA Lottery 2023: 2023లో రెండవ సారి మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (MHADA) కొంకణ్ బోర్డ్ థానే, పాల్ఘర్, రాయ్‌ఘడ్ జిల్లాలతో సహా ముంబైకి సమీపంలోని శాటిలైట్ టౌన్‌షిప్‌లో 5,311 సరసమైన గృహాలను విక్రయించడానికి లాటరీని ప్రకటించింది. ఈ ఇళ్లు రూ.9 నుంచి రూ.49 లక్షల రేంజ్‌లో ఉంటాయని ఎంహెచ్ఏడీఏ ప్రకటించింది.
వీటిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద 1,000 ఇళ్లను విక్రయిస్తున్నారు. EWS (ఆర్థికంగా బలహీనమైన విభాగం) కేటగిరీ కింద ప్రయోజనాలకు అర్హత పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కుటుంబ ఆదాయాన్ని రూ. 3 నుంచి రూ. 6 లక్షలకు పరిమితం చేసింది. దీని కారణంగా, ఈ కేటగిరీ కింద దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని MHADA భావిస్తోంది.
"ప్రజలు తమ దరఖాస్తులను అక్టోబర్ 16, 2023 వరకు సమర్పించవచ్చు. లాటరీ ఫలితాలు నవంబర్ 7న ప్రకటిస్తాం" అని MHADA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ జైస్వాల్ తెలియజేశారు.