LPG Cylinder Price Hike in India: మళ్లీ బాదుడు.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

LPG Cylinder Price Hike in India: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి షాకిచ్చారు.

Update: 2020-07-01 05:00 GMT

LPG Cylinder Price Hike in India: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి షాకిచ్చారు. మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పైపైకి చేరాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.4.50 వరకు పెరిగింది. జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 14.2 కేజీల సిలిండర్‌కు ఇది వర్తిస్తుంది.

గ్యాస్ సిలిండర్ ధర రెండో నెల కూడా పెరగడం గమనార్హం. ఇకపోతే ఎల్‌పీజీ సిలిండర్ ధర జూన్ నెలలో రూ.11.5 మేర పెరిగిన విషయం తెలిసిందే. దీని కన్నా ముందు మార్చి నుంచి మే వరకు చూస్తే గ్యాస్ సిలిండర్ ధర రూ.277 మేర తగ్గింది.

తాజా రేట్ల పెంపు వివిధ రాష్ట్రాల్లో ఇలా ఉంది.

* ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర కేవలం రూ.1 మాత్రమే పెరిగింది. దీంతో ధర రూ.594కు చేరింది.

* కోల్‌కతాలో గ్యాస్ సిలిండర్ ధర రూ.4.5 పెరిగింది. దీంతో ధర రూ.620కు ఎగసింది. ముంబైలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.3.5 పైకి చేరింది. దీంతో ధర రూ.594కు ఎగసింది.

* చెన్నైలోనూ గ్యాస్ సిలిండర్ ధర రూ.4 పెరుగుదలతో రూ.610కు చేరింది.

* హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.4 పెరుగుదలతో రూ.645కు ఎగసింది. 

Tags:    

Similar News