Loans: ప్లాట్‌, ఇల్లు, ఫామ్‌ హౌస్‌కి లోన్లు వేర్వేరుగా ఉంటాయి.. తేడా తెలుసుకోండి..!

Loans: మీరు హోమ్‌లోన్‌ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే కేటాయింపులు చాలా రకాలుగా ఉంటాయని గుర్తుంచుకోండి.

Update: 2023-03-14 06:06 GMT

Loans: ప్లాట్‌, ఇల్లు, ఫామ్‌ హౌస్‌కి లోన్లు వేర్వేరుగా ఉంటాయి.. తేడా తెలుసుకోండి..!

Loans: మీరు హోమ్‌లోన్‌ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే కేటాయింపులు చాలా రకాలుగా ఉంటాయని గుర్తుంచుకోండి. ఇల్లు, ప్లాట్లు, ఫామ్ హౌస్ లోన్లకి వేర్వేరు నిబంధనలు వర్తిస్తాయి. ఫ్లాట్ (అపార్ట్‌మెంట్‌) లేదా నివాస గృహాన్ని కొనుగోలు చేయడానికి వీలుగా హోమ్‌లోన్స్‌ పంపిణీ చేస్తారు. నిర్మాణంలో ఉన్న ఆస్తులకి కూడా ఈ లోన్లు వర్తిస్తాయి. కానీ ప్లాట్‌పై రుణం మాత్రం భూమి కోసం మాత్రమే ఇస్తారు. అది చివరికి నివాస ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

సాధారణంగా బ్యాంకులు ఫామ్‌హౌస్‌ విధానంలో శాశ్వత నిర్మాణం చేయడానికి రుణం ఇస్తాయి. ఈ రుణాలను 'అగ్రికల్చర్ టర్మ్ లోన్స్' లేదా ATL అని పిలుస్తారు. ఇవి రైతుల కోసం ఇచ్చే లోన్లు అని చెప్పవచ్చు. ఫామ్‌హౌస్ నిర్మాణానికి ఇచ్చే రుణం, ఇంటి రుణానికి భిన్నంగా ఉంటుంది. కొన్ని ప్రభుత్వ రుణదాతలు ఫామ్‌హౌస్ రుణాలను అందిస్తారు. ఉదాహరణకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'సెంట్ అగ్రి-ఫార్మ్‌హౌస్ స్కీమ్'ని నిర్వహిస్తుంది. దీనిలో వ్యవసాయ-ఫామ్‌హౌస్‌ల నిర్మాణం, మరమ్మత్తు, పునర్నిర్మాణం, విస్తరణ కోసం రుణాలను అందిస్తుంది. ఈ రుణాలు ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 80 శాతం కవర్ చేస్తాయి.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫామ్‌హౌస్‌ల నిర్మాణం కోసం ఒక పథకాన్ని అమలు చేస్తుంది. 2 లక్షల నుంచి 50 లక్షల మధ్య రుణ మొత్తం వ్యవసాయ వ్యాపారంలో నిమగ్నమై ఉన్న వ్యక్తులకు మాత్రమే పంపిణీ చేస్తుంది. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవసాయ భవన నిర్మాణానికి రుణాలు అందిస్తుంది. వ్యవసాయ వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులకు ఇది ప్రత్యేకమైనది. మొత్తం ఖర్చులో గరిష్టంగా 85 శాతం ఇస్తారు.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

గరిష్ఠ కాలవ్యవధి: వ్యక్తిగత ప్రాధాన్యతలు, ఆదాయం ఆధారంగా రుణ కాలపరిమితిని ఎంచుకోవచ్చు. అయితే గృహ రుణ చెల్లింపుకు గరిష్ట కాలవ్యవధి 30 సంవత్సరాలు, అయితే భూ రుణాలను గరిష్టంగా 15 సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లించాలి.

పన్ను మినహాయింపు: హోమ్ లోన్ విషయంలో అసలు, వడ్డీ రెండింటిపై పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. దీనికి విరుద్ధంగా భూమి రుణం విషయంలో నిర్మాణ వ్యయాన్ని కవర్ చేయడానికి మాత్రమే పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి.

రుణం విలువ: గృహం విషయంలో 75 శాతం నుంచి 90 శాతం, ప్లాట్ లోన్ కోసం 75 శాతం నుంచి 80 శాతం మధ్య మారుతూ ఉంటుంది. ఫామ్‌హౌస్ నిర్మాణం విషయంలో గరిష్టంగా LTV 80-85 శాతం మధ్య ఉంటుంది.

Tags:    

Similar News