ఈ స్కీమ్‌లలో చేరితే లైఫ్‌లాంగ్‌ సంపాదన.. నామినీకి కూడా డబ్బు అందుతుంది..

Annuity Plan: మీరు చాలా పెన్షన్ ప్లాన్ల గురించి విని ఉంటారు. కానీ యాన్యుటి ప్లాన్ గురించి విని ఉండరు.

Update: 2022-01-26 13:30 GMT

ఈ స్కీమ్‌లలో చేరితే లైఫ్‌లాంగ్‌ సంపాదన.. నామినీకి కూడా డబ్బు అందుతుంది..

Annuity Plan: మీరు చాలా పెన్షన్ ప్లాన్ల గురించి విని ఉంటారు. కానీ యాన్యుటి ప్లాన్ గురించి విని ఉండరు. ఇది కూడా పెన్షన్ మాదిరి పథకమే. కానీ దీనికి బీమా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు జీవితాంతం ఆదాయం వస్తూనే ఉంటుంది. ఏదైనా కంపెనీకి ఒక్కసారి కొంత అమౌంట్ ఇన్సూరెన్స్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత మీకు ప్రతినెలా పెన్షన్ మాదిరి డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇందుకోసం మీరు ప్రతినెల డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు. యాన్యుటీ ప్లాన్లో బీమా కంపెనీలు తమ డిపాజిటర్లకు జీవితాంతం స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి హామీ ఇస్తాయి.

కొన్ని ఉత్తమ యాన్యుటీ ప్లాన్ల గురించి మాట్లాడినట్లయితే HDFC లైఫ్, ICICI ప్రుడెన్షియల్, SBI లైఫ్ ఉంటాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ తీసుకోవాలంటే రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మీరు 10 లక్షల రూపాయల మొత్తం రిటర్న్ పొందుతారు అనంతరం నెలకు 5 నుంచి 6 వేల పెన్షన్ కూడా పొందుతారు. రెండోది ICICI ప్రుడెన్షియల్ దీనిలో మీరు 10 లక్షల రూపాయలు చెల్లించి తర్వాత 10 లక్షల రూపాయలు పొందుతారు. దీంతో పాటు ప్రతినెలా రూ.4 వేల పెన్షన్ కూడా పొందుతారు. మూడోది SBI లైఫ్ ఉంది దీనిలో మీరు రూ.10 లక్షలు చెల్లించాలి తర్వాత రూ. 10 లక్షలు తిరిగి చెల్లిస్తారు. ప్రతి నెలా రూ.4.26 వేలు పింఛను పొందుతారు.

యాన్యుటీ ప్లాన్ భవిష్యత్లో సూపర్గా ఉపయోగపడుతుంది. ఇది సురక్షితమైన పెట్టుబడి మార్గాలలో ఒకటి. యాన్యుటీ ప్లాన్ తీసుకుంటున్నప్పుడు బీమా కంపెనీ మీకు హామీ ఇవ్వబడిన ఆదాయం పెన్షన్ రక్షణ గురించి తెలియజేస్తుంది. మీకు ఎప్పుడు, ఎలా, ఏ కాలంలో డబ్బు కావాలో ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. రిటర్న్లతో కూడిన లైఫ్ యాన్యుటీ ప్లాన్లో మీరు జీవించి ఉన్నంత వరకు స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు. డిపాజిటర్ మరణించిన తర్వాత బీమా కంపెనీ నామినీకి ప్లాన్ను రూ.లో కొనుగోలు చేసినంత డబ్బును తిరిగి ఇస్తుంది. 

Tags:    

Similar News