Life Insurance: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఒక పెట్టుబడి ఎంపిక.. తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు మరిచిపోవద్దు..!

Life Insurance: ఈ రోజుల్లో మార్కెట్‌లో లభించే పెట్టుబడి ఎంపికల్లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కూడా ఒకటి. ప్రతి ఒక్కరు ఏదో ఒక లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల పేరుపై పాలసీ రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు.

Update: 2023-07-23 14:00 GMT

Life Insurance: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఒక పెట్టుబడి ఎంపిక.. తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు మరిచిపోవద్దు..!

Life Insurance: ఈ రోజుల్లో మార్కెట్‌లో లభించే పెట్టుబడి ఎంపికల్లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కూడా ఒకటి. ప్రతి ఒక్కరు ఏదో ఒక లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల పేరుపై పాలసీ రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. అయితే లైఫ్ కవర్ తీసుకునేటప్పుడు కొనుగోలు చేస్తున్న పాలసీపై పూర్తి అవగాహన ఉండాలి. లాభనష్టాలని భేరిజు వేయాలి. కచ్చితంగా కొన్ని విషయాలని గమనించాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌

ఒక వ్యక్తి మంచి రాబడి, ఆర్థిక భద్రత కోరుకుంటే అతడు లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనివల్ల ప్రజలు జీవితం, జీవితం తర్వాత కూడా భద్రతను పొందుతారు. అలాగే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ జీవితంలో రక్షణ, పెట్టుబడి ప్రయోజనాలను అందించే వివిధ రకాల పాలసీలను కలిగి ఉంటుంది. ఈ పాలసీలు లైఫ్‌ కవరేజీతో పాటు పొదుపుని మిళితం చేసి ఉంటాయి. పాలసీదారులు చాలా రోజులు డబ్బును కూడబెట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలలో ఎండోమెంట్ ప్లాన్‌లు, హోల్ లైఫ్ ప్లాన్‌లు, మనీ-బ్యాక్ పాలసీలు, యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు (యులిప్‌లు) మొదలైనవి ఉంటాయి..

డెత్ బెనిఫిట్స్

లైఫ్ ఇన్సూరెన్స్ డెత్ బెనిఫిట్స్ అలాగే మెచ్యూరిటీ బెనిఫిట్‌లను అందజేస్తుంది. పాలసీ వ్యవధిలో జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్స్‌, మరణించినప్పుడు డెత్ బెనిఫిట్స్ అందుతాయి. దీనితో పాటు పన్ను ప్రయోజనం లభిస్తుంది. కుటుంబ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను అంచనా వేయడం వల్ల వ్యక్తులు అవసరాలకు సరిపోయే పాలసీని తీసుకోవచ్చు. ఇది వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.

పెట్టుబడి

లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మంచి పెట్టుబడి ఎంపిక. సాధారణంగా ఇందులో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలి. ఈ సమయంలో డబ్బు ప్రీమియం రూపంలో జమవుతుంది. ఆ ప్రీమియంపై వడ్డీ, బోనస్‌లు యాడ్‌ అవుతాయి. మెచ్యూరిటీ సమయంలో ప్రీమియంగా డిపాజిట్ చేసిన మొత్తం, వడ్డీ, బోనస్‌లు అన్ని కలిపి పెద్ద మొత్తం అందుకుంటారు.

Tags:    

Similar News