LIC Pension: ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా 12,000 పెన్షన్..!

LIC Pension: ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా 12,000 పెన్షన్..!

Update: 2022-07-13 04:30 GMT

LIC Pension: ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా 12,000 పెన్షన్..!

LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన కోట్లాది మంది కస్టమర్లు, పెట్టుబడిదారుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడి కోసం ఎల్‌ఐసీకి మించినది మరొకటి లేదు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇందులో గొప్ప స్కీంలు ఉన్నాయి. అందులో ఒకటి సరళ పెన్షన్ ప్లాన్. ఇది వృద్ధులకు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇందులో పెట్టుబడి పెట్టిన తర్వాత నెలా నెలా పెన్షన్ పొందుతారు. ఈ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ సరళా పెన్షన్ ప్లాన్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీరు జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటారు. పాలసీదారు మరణించిన తర్వాత పెట్టుబడి మొత్తం తిరిగి నామినీకి ఇస్తారు. ఈ పథకాన్ని 40 ఏళ్ల వయస్సు నుంచి 80 ఏళ్ల వయస్సు వరకు కొనుగోలు చేయవచ్చు. మీరు ఒంటరిగా లేదా భార్యాభర్తలతో కలిసి ఈ పథకాన్ని తీసుకోవచ్చు. పాలసీదారు ఈ పాలసీని ప్రారంభించిన తేదీ నుంచి అవసరమైతే 6 నెలల తర్వాత సరెండర్ చేసే అవకాశం కూడా ఉంటుంది.

ఇటీవల రిటైర్మెంట్‌ తీసుకున్న వ్యక్తులు నెలకు 12,000 పెన్షన్ పొందవచ్చు. ఎలాగంటే రిటైర్మెంట్‌ తర్వా త పీఎఫ్‌ ఫండ్ నుంచి వచ్చిన డబ్బు ఇందులో పెట్టుబడి పెడితే సులువుగా పెన్షన్ పొందుతారు. ఎల్‌ఐసీ కాలిక్యులేటర్ ప్రకారం ఎవరైనా 42 ఏళ్ల వ్యక్తి రూ. 30 లక్షల ప్లాన్‌ కొనుగోలు చేస్తే అతను ప్రతి నెలా రూ.12,388 పెన్షన్‌గా పొందుతాడు. ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ఈ ప్లాన్‌లో ఒకసారి ప్రీమియం చెల్లించిన తర్వాత ఎవరైనా వార్షిక, అర్ధ వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన పెన్షన్ తీసుకోవచ్చు. ఈ పాలసీని కొనుగోలు చేయడం ద్వారా మీరు లోన్ సౌకర్యం కూడా పొందుతారు.

Tags:    

Similar News