ఎల్‌ఐసీ అద్భుత పాలసీ.. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం పెన్షన్..!

*ఎల్‌ఐసీ అద్భుత పాలసీ.. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం పెన్షన్..!

Update: 2023-01-14 15:00 GMT

ఎల్‌ఐసీ అద్భుత పాలసీ.. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం పెన్షన్..!

LIC Saral Pension Yojana: ఎల్‌ఐసీ అనేక రకాల పాలసీలని ప్రవేశపెడుతోంది.

మీరు ఒకవేళ జీవితకాలం సంపాదించడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే ఎల్‌ఐసీ అందించే ఈ ప్లాన్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ఇందులో మీరు ప్రతి నెలా డబ్బు పొందుతారు. ఈ పాలసీ పేరు సరళ్ పెన్షన్ యోజన. దీనిలో మీరు 40 సంవత్సరాల వయస్సు నుంచి పెన్షన్ పొందుతారు. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రీమియం ఒక్కసారి మాత్రమే

ఇది ఒక రకమైన సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్. ఇందులో ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాలి. తర్వాత జీవితాంతం సంపాదించవచ్చు. పాలసీదారు మరణించిన తర్వాత నామినీకి సింగిల్ ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. సరళ్ పెన్షన్ యోజన అనేది తక్షణ యాన్యుటీ ప్లాన్. అంటే మీరు పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. ఇందులో 2 రకాల పాలసీలు ఉంటాయి.

సింగిల్ లైఫ్- ఇందులో పాలసీ ఎవరి పేరు మీద ఉంటుందో వారు జీవితాంతం పెన్షన్‌ పొందుతూనే ఉంటాడు. అతని మరణం తర్వాత బేస్ ప్రీమియం నామినీకి తిరిగి చెల్లిస్తారు.

ఉమ్మడి లైఫ్‌ - ఇందులో భార్యాభర్తలిద్దరికీ కవరేజీ ఉంటుంది. పాలసీ హోల్డర్‌ జీవించి ఉన్నంత కాలం పెన్షన్‌ అందుతుంది. అతని మరణానంతరం వారి జీవిత భాగస్వామికి పెన్షన్ అందుతుంది. ఇద్దరి మరణం తర్వాత బేస్ ప్రీమియం నామినీకి అందుతుంది.

ప్లాన్ స్పెషాలిటీ ఏంటంటే..

ఈ పథకం ప్రయోజనం కోసం కనీస వయోపరిమితి 40 సంవత్సరాలు. గరిష్టంగా 80 సంవత్సరాలు ఉండాలి. ఇది మొత్తం జీవిత పాలసీ కాబట్టి జీవితాంతం పెన్షన్ అందుబాటులో ఉంటుంది. సరళ పెన్షన్ పాలసీని ప్రారంభించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు. ఇది కాకుండా త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన పెన్షన్ తీసుకోవచ్చు.

Tags:    

Similar News