LIC Policy: రోజుకు రూ. 29 సేవ్‌ చేస్తే రూ. 4 లక్షలు పొందొచ్చు.. బెస్ట్‌ స్కీమ్‌..!

LIC Policy: ఈ పథకం మెచ్యూరిటీ సమయం 10 ఏళ్లు ఉంటుంది. అయితే గరిష్టంగా 20 ఏళ్ల వరకు పెంచుకోవచ్చు. బోనస్ ఏడాదికి 4.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా లెక్కిస్తారు.

Update: 2024-06-25 07:30 GMT

Aadabidda Nidhi Scheme: మహిళలకు గుడ్ న్యూస్..ఈ పత్రాలు సిద్దంగా ఉంటే..ప్రతినెలా రూ. 1500 మీ సొంతం

LIC: భవిష్యత్తులో ఏర్పడే ఆర్థిక అవసరాల దృష్ట్యా డబ్బును పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వారి వారి సంపాదన ఆధారంగా డబ్బును ఆదా చేస్తున్నారు. అయితే సంపాదించే డబ్బు ఆదా చేయడం కోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సంస్థల్లో పెట్టుబడి పెడితే సెక్యూరిటీ ఉంటుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ఇలాంటి వాటిలో ఎల్‌ఐసీ ఒకటి. ఎల్‌ఐసీలో పెట్టుబడి పెడితే భద్రతతో పాటు మంచి రిటర్న్స్‌ ఉంటాయి.

అలాంటి పథకాల్లో ఒక బెస్ట్‌ స్కీమ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్ఐసీ అందిస్తోన్న బెస్ట్‌ పథకాల్లో ఎల్‌ఐసీ ఆధార్ శిలా యోజన ఒకటి. ఈ పథకాన్ని మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఈ పథకం సేవింగ్స్-కమ్-ప్రొటెక్షన్ ప్లాన్, ఇది హామీతో కూడిన రాబడి, జీవిత బీమా రెండింటినీ అందిస్తుంది. ఆధార్‌ కార్డు ఉంటే ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ పథకంలో చేరిన మహిళలు రోజువారీ, నెల, ఆరు నెలలు, సంవత్సరం చొప్పున పెట్టుబడి పెట్టొచ్చు. మొదట ప్రాథమిక పెట్టుబడిగా కనీసం రూ.75,000, గరిష్టంగా రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.

ఈ పథకం మెచ్యూరిటీ సమయం 10 ఏళ్లు ఉంటుంది. అయితే గరిష్టంగా 20 ఏళ్ల వరకు పెంచుకోవచ్చు. బోనస్ ఏడాదికి 4.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా లెక్కిస్తారు. ఉదాహరణకు మీ వయసు 30 ఏళ్లు ఉందని అనుకోండి. రోజుకు రూ. 29 చొప్పున 10 ఏళ్లు పెట్టుబడి పెడితే రూ. 2,11,170 చెల్లించాల్సి వస్తుంది. అయితే, 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ బెనిఫిట్‌గా రూ.4 లక్షలు లభిస్తాయి. అంటే మీరు పెట్టుబడి పెట్టి దానికి రూ. 1.88 లక్షల లాభాన్ని పొందొచ్చు. ఈ పథకంలో 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు మధ్యలో మహిళలు చేరొచ్చు. 70 ఏళ్ల వరకు ఈ స్కీమ్‌లో కాంట్రిబ్యూట్ చేయవచ్చు.

Tags:    

Similar News