LIC Policy: పిల్లల భవిష్యత్ కోసం అద్భుత పాలసీ.. రోజు రూ.150 పొదుపు చేస్తే 19 లక్షలు మీవే..!
LIC Policy: ఈ రోజుల్లో పొదుపు, పెట్టుబడులపై ప్రజల్లో ఆసక్తి బాగా పెరిగింది.
LIC Policy: ఈ రోజుల్లో పొదుపు, పెట్టుబడులపై ప్రజల్లో ఆసక్తి బాగా పెరిగింది. ముఖ్యంగా పిల్లలు పుట్టడంతోనే తల్లిదండ్రులు వారిపేరుమీద రకరకాల ప్లాన్‌లు చేస్తున్నారు. అందులో భాగంగా చాలామంది ఎల్‌ఐసీ పాలసీలని తీసుకుంటున్నారు. ఆదాయంలో కొంత శాతాన్ని పొదుపు చేస్తే పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం ఎల్‌ఐసీ ఒక గొప్ప పథకాన్ని అందిస్తోంది. కొత్త చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ పథకం ద్వారా పిల్లల భవిష్యత్‌కి భరోసాని కల్పిస్తోంది. ఈ పాలసీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
మనీ బ్యాక్ ప్లాన్
మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజే ఎల్‌ఐసీ కొత్త చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్‌లో చేరవచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్‌లో పిల్లలని ధనవంతులు చేయవచ్చు. దీని కోసం మీరు ప్రతిరోజూ 150 రూపాయలు ఆదా చేస్తే సరిపోతుంది. చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ పాలసీ 25 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అలాగే మీరు మెచ్యూరిటీ మొత్తాన్ని వాయిదాలలో పొందుతారు. మీ బిడ్డకు 18 సంవత్సరాలు నిండినప్పుడు మొదటి వాయిదా చెల్లిస్తారు. రెండోసారి బిడ్డకు 20 ఏళ్లు వచ్చినప్పుడు, మూడోసారి 22 ఏళ్లు వచ్చినప్పుడు రెండు వాయిదాలు చెల్లిస్తారు.
కొత్త చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్ కింద జీవిత బీమా చేసిన వ్యక్తికి బీమా మొత్తంలో 20-20 శాతం మనీ బ్యాక్ ట్యాక్స్‌గా లభిస్తుంది. దీంతో పాటు మీ పిల్లలకి 25 సంవత్సరాలు నిండినప్పుడు మొత్తం అతనికి తిరిగి చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం మొత్తంతో బోనస్ ఇస్తారు. ఈ విధంగా ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా పిల్లలు పెద్దవాడైన వెంటనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది.
కేవలం రూ.150 ఆదా చేయండి.
పిల్లల భవిష్యత్తు కోసం ప్రారంభించిన ఈ బీమా వాయిదా సంవత్సరానికి రూ.55,000 అవుతుంది. 25 ఏళ్లలో మొత్తం 14 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. అదే సమయంలో మీరు మెచ్యూరిటీపై మొత్తం 19 లక్షల రూపాయలు పొందుతారు. అయితే ఈ వ్యవధిలో బీమా చేసిన వ్యక్తి చనిపోకపోతే మాత్రమే ఈ నియమం వర్తిస్తుందని గుర్తుంచుకోండి. మీరు డబ్బును విత్‌డ్రా చేయకూడదనుకుంటే మెచ్యూరిటీపై వడ్డీతో పాటు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తారు.