LIC Policy: ఆడపిల్లలపెళ్లికోసం సూపర్ పాలసీ.. ప్రతిరోజు రూ.150 పొదుపుతో రూ.31 లక్షలు పొందవచ్చు..!
LIC Kanyadan Policy, LIC Kanyadan Policy Benefits, Daughters Marriage Policy, Lic Policy
LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఈ కంపెనీ ప్రతి ఒక్కరి కోసం అద్భుత మైన పాలసీలను రూపొందిస్తుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికోసం తక్కువ మొత్తంలో ఎక్కువ ఆదాయం వచ్చే పాలసీలను ప్రవేశపెట్టి చాలా కుటుంబాలను ఆదుకుంటోంది. వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తుంది. ఈ రోజుల్లో ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారి పెళ్లి గురించి నిత్యం తల్లిదండ్రులు ఆలోచిస్తూనే ఉంటారు. పెరిగిన ధరల వల్ల అమ్మాయి పెళ్లి ఏ విధంగా చేయాలని దిగులు చెందుతుంటారు. ఇలాంటి వారికోసం ఎల్‌ఐసీ ఒక సూపర్ ప్లాన్ ప్రవేశపెట్టింది. దానిపేరు ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ . ఇందులో నెలకు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయడం వల్ల ఆమె పెళ్లి నాటికి లక్షల రూపాయలు పోగుచేయవచ్చు. ఈ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ తీసుకోవాలంటే మీరు కనీసం 30 ఏళ్లు ఉండాలి. మీ బిడ్డకు కనీసం 1 సంవత్సరం వయస్సు ఉండాలి. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ 25 సంవత్సరాలు అయినప్పటికీ మీరు 22 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 3 ఏళ్లు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కూతురి వయస్సును బట్టి పాలసీ కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడానికి
కుమార్తె జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, బ్యాంక్ పాస్ బుక్ ఉండాలి. ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని తీసుకోవడానికి మీరు సమీపంలోని ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి డెవలప్‌మెంట్ అధికారిని సంప్రదించవచ్చు. లేదంటే ఎల్‌ఐసీ ఏజెంట్‌ను సంప్రదించవచ్చు.
రూ.150 పొదుపుతో రూ.31 లక్షలు
కన్యాదాన్ పాలసీలో రోజుకు రూ.151 చెల్లించాలి అంటే నెలకు రూ.4530 పొదుపు చేయాలి. 22 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత 25 ఏళ్లు పూర్తయిన తర్వాత రూ.31 లక్షలు పొందుతారు. ఈ మొత్తాన్ని కుమార్తె తదుపరి చదువుల కోసం లేదా ఆమె పెళ్లికోసం ఉపయోగించవచ్చు. ఇది కాకుండా కన్యాదాన్ పాలసీలో రోజుకు రూ.121 డిపాజిట్ చేస్తే అప్పుడు 27 లక్షల రూపాయలు వస్తాయి. ఈ పాలసీకి బీమా కూడా వర్తిస్తుంది. పాలసీదారుడు ఆకస్మికంగా మరణిస్తే కుటుంబం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా బీమా చేసినవారి తండ్రి ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు చెల్లిస్తారు.