LIC Policy: ప్రతిరోజూ రూ. 43 పొదుపు చేస్తే ఏడాదికి 40,000 పెన్షన్..!

LIC Policy: ప్రతిరోజూ రూ. 43 పొదుపు చేస్తే ఏడాదికి 40,000 పెన్షన్..!

Update: 2022-04-24 14:30 GMT

LIC Policy: ప్రతిరోజూ రూ. 43 పొదుపు చేస్తే ఏడాదికి 40,000 పెన్షన్..!

LIC Policy: ఎల్‌ఐసీ భారతదేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీ. దేశంలోని ప్రతి వర్గాలకి ఇన్సూరెన్స్‌ పాలసీలని అందిస్తుంది. రిస్క్ లేని పెట్టుబడిని ఇష్టపడే పెట్టుబడిదారులు ఎల్‌ఐసిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతారు. ఈ రోజు ఒక LIC పాలసీ గురించి తెలుసుకుందాం. మీరు ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా 100 సంవత్సరాల వరకు బీమా రక్షణ పొందుతారు. ఈ పాలసీ LIC యొక్క జీవన్ ఉమంగ్ పాలసీ. ఇది ఎండోమెంట్ పాలసీ. ఇది మెచ్యూరిటీపై మీకు భారీ మొత్తంలో ప్రయోజనాన్ని అందిస్తుంది.

జీవన్ ఉమంగ్ పాలసీ

మీరు ఈ పాలసీని 90 రోజుల వయస్సు నుంచి 55 సంవత్సరాల వయస్సు వరకు తీసుకోవచ్చు. ఇది మీకు జీవిత బీమా కవరేజీని అందించడమే కాకుండా బీమా వ్యవధి పూర్తయిన తర్వాత మెచ్యూరిటీపై పెద్ద మొత్తాన్ని పొందుతారు. ఒక వ్యక్తి 100 ఏళ్లలోపు మరణిస్తే ఈ పరిస్థితిలో డిపాజిట్ మొత్తం నామినీకి చెల్లిస్తారు. మీరు ఈ పాలసీ కాల వ్యవధిని 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. ఈ పాలసీలో పెట్టుబడిదారుడు కనీసం రూ. 2 లక్షల హామీ మొత్తాన్ని పొందుతాడు.

ప్రతిరోజూ ఇలా చేయండి

ఈ పాలసీ ప్రయోజనాన్ని పొందడానికి ప్రతిరోజూ రూ.43 పెట్టుబడితో ప్రారంభించండి. అంటే మీరు ప్రతి నెలా దాదాపు రూ.1302 పెట్టుబడి పెడతారు. ఒక సంవత్సరంలో ఈ ప్రీమియం దాదాపు రూ. 15,298 అవుతుంది. మీరు 30 సంవత్సరాల కాలవ్యవధిని ఎంచుకుంటే డిపాజిట్ మొత్తం రూ. 4.58 లక్షలు అవుతుంది. మీరు 40 సంవత్సరాల వయస్సులో ఈ పాలసీని కొనుగోలు చేస్తే 70 సంవత్సరాల పాటు దాని ప్రీమియం చెల్లించాలి. తరువాత 71 వ సంవత్సరం నుంచి 100 సంవత్సరాల వరకు మీరు ప్రతి సంవత్సరం నెలకు రూ. 3333 అంటే సంవత్సరానికి సుమారు 40 వేల రూపాయలు అందుకుంటారు. ఈ మొత్తం లాభం దాదాపు 27.60 లక్షలు. ఒకవేళ 100 ఏళ్లలోపు మరణిస్తే అప్పుడు మొత్తం నామినీకి చెల్లిస్తారు. 

Tags:    

Similar News