LIC Policy: ప్రతిరోజు రూ.200 పొదుపు చేస్తే 28 లక్షలు మీవే..!

LIC Policy: ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పొదుపు, రక్షణకు హామీ ఇస్తుంది

Update: 2022-08-27 06:24 GMT

LIC Policy: ప్రతిరోజు రూ.200 పొదుపు చేస్తే 28 లక్షలు మీవే..!

LIC Policy: మీరు సురక్షితమైన పెట్టుబడి కోసం ప్లాన్ చేస్తుంటే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి స్టాక్ మార్కెట్లో లాభాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు రిస్క్ లేకుండా లాభం పొందాలనుకుంటే ఎల్‌ఐసీలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. ఈరోజు బంపర్ లాభాలను అందించే ఒక ఎల్‌ఐసీ పాలసీ గురించి తెలుసుకుందాం.

ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పొదుపు, రక్షణకు హామీ ఇస్తుంది. ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మిలియనీర్ అవ్వడమే కాకుండా రిస్క్ కవర్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ 3 ఫిబ్రవరి 2016న ప్రారంభించారు. ఇందులో రెగ్యులర్ ప్రీమియంలు చెల్లించాలి. మీరు లైఫ్ కవర్ (డెత్ బెనిఫిట్) కూడా పొందుతారు. ప్రతి 5 సంవత్సరాలకు ఈ కవరేజి పెరుగుతుంది. ఈ మొత్తం మీ పాలసీ ఎంతకాలం యాక్టివ్‌గా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది.

ఈ పాలసీ తీసుకున్న తేదీ నుంచి 5 సంవత్సరాలలోపు పాలసీదారు మరణిస్తే 100% బేసిక్ సమ్ అష్యూర్డ్ అందిస్తారు. అదే విధంగా పాలసీ తీసుకున్న 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య పాలసీదారు మరణిస్తే 125%, 11 నుంచి 15 సంవత్సరాల మధ్య 150%, 16, 20 సంవత్సరాల మధ్య 200% చెల్లిస్తారు. ఈ ప్లాన్‌లో యాక్సిడెంట్ బెనిఫిట్, డిసేబిలిటీ రైడర్ ఉంటుంది. దీని కోసం మీరు కొంత అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

జీవన్ ప్రగతి ప్లాన్ మెచ్యూరిటీ ప్రయోజనం తర్వాత మీరు రూ.28 లక్షల మొత్తాన్ని అందుకుంటారు. ఇందులో 20 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుడు నెలకు 6 వేల రూపాయలు అంటే ప్రతిరోజూ 200 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఈ పాలసీని 12 సంవత్సరాల వయస్సు నుంచి ప్రారంభించవచ్చు. ఇందులో గరిష్ట పెట్టుబడి వయస్సు 45 సంవత్సరాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News