Lic Policy: రోజు 260 రూపాయల పొదుపుతో సులభంగా 54 లక్షలు..!
LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెట్టుబడికి ఉత్తమమైన మార్గం.
LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పెట్టుబడికి ఉత్తమమైన మార్గం. ఈ జీవిత బీమా కంపెనీ అన్ని వర్గాల వారికి పాలసీలని రూపొందించింది. ఇందులో ప్రతిరోజు 260 రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల సులభంగా 54 లక్షల రూపాయల సంపాదించే పాలసీ కూడా ఉంది. ఆ పాలసీ పేరు ఎల్‌ఐసీ జీవన్ లాభ్. ఇది పరిమిత ప్రీమియం చెల్లింపుతో నాన్-లింక్డ్ ప్రాఫిట్ ప్లాన్.
ఈ పాలసీ కింద మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ఏకమొత్తం చెల్లిస్తారు. అయితే పాలసీదారుడు మరణిస్తే అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది స్టాక్ మార్కెట్ లింక్డ్ ప్లాన్ కాదు. ఇందులో పరిమిత కాల వ్యవధికి పెట్టుబడి పెడుతారు. ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ యోజన మెచ్యూరిటీ సమయంలో పాలసీదారుకు పూర్తి హామీతో పాటు రివర్షనరీ బోనస్, చివరి అదనపు బోనస్ ప్రయోజనాన్ని అందిస్తుంది. బీమా చేసిన వ్యక్తి 10, 13, 16 సంవత్సరాలకు ప్రీమియంను డిపాజిట్ చేయవచ్చు.
వారికి 16 నుంచి 25 సంవత్సరాల తర్వాత డబ్బు అందుతుంది. ఈ పథకాన్ని 8 సంవత్సరాలలో తీసుకోవచ్చు. గరిష్ట వయస్సు 59 సంవత్సరాలు. 59 ఏళ్ల పాటు బీమా తీసుకునే వ్యక్తులు 16 ఏళ్ల టర్మ్ ప్లాన్‌ను మాత్రమే ఎంచుకోవాలి. వారికి 75 ఏళ్లలో బీమా ప్రయోజనం అందుతుంది. మీ వయస్సు 25 ఏళ్లు మీరు 25 సంవత్సరాల పెట్టుబడి ప్రణాళికను రూపొందించినట్లయితే మీకు రూ. 54 లక్షల వరకు అందుతుంది.
ఈ మొత్తాన్ని పొందడానికి మీరు ప్రతిరోజూ రూ.260 పెట్టుబడి పెట్టాలి. అంటే ఏటా రూ.92,400 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది 25 ఏళ్లలో రూ.20 లక్షలకు చేరుకుంటుంది. తర్వాత రివర్షనరీ బోనస్, చివరి అదనపు బోనస్‌తో పాటు మొత్తం 50 నుంచి 54 లక్షల రూపాయలను పొందుతారు.