LIC: ఎల్‌ఐసీ ఎక్సలెంట్ ప్లాన్‌.. నెలకి రూ.233 పొదుపు చేస్తే సులువుగా 17 లక్షలు..!

LIC: ఎల్‌ఐసీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు గొప్ప పథకాలను ప్రవేశపెడుతుంది. అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని వారికోసం పాలసీలని రూపొందిస్తుంది.

Update: 2022-05-22 08:04 GMT

LIC: ఎల్‌ఐసీ ఎక్సలెంట్ ప్లాన్‌.. నెలకి రూ.233 పొదుపు చేస్తే సులువుగా 17 లక్షలు..!

LIC: ఎల్‌ఐసీ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు గొప్ప పథకాలను ప్రవేశపెడుతుంది. అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని వారికోసం పాలసీలని రూపొందిస్తుంది. మీరు కూడా ఇలాంటి పథకాలలో పెట్టుబడి మంచి లాభాలు సంపాదించాలంటే LICకి సంబందించి ఈ పాలసీ ఉపయోగకరంగా ఉంటుంది. LIC జీవన్ లాభ్ పాలసీ అలాంటి పాలసీలో ఒకటి. ఇందులో మీరు ప్రతి నెలా కేవలం రూ. 233 డిపాజిట్ చేయడం ద్వారా 17 లక్షల భారీ ఫండ్ పొందవచ్చు. ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

LIC జీవన్ లాభ్

ఇది నాన్-లింక్డ్ పాలసీ. ఈ పాలసీకి షేర్ మార్కెట్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. మార్కెట్ పెరిగినా దిగజారినా అది మీ డబ్బుపై ఏమాత్రం ప్రభావం చూపదు. అంటే ఈ పథకంలో మీ డబ్బు పూర్తిగా సురక్షితం. ఇది పరిమిత ప్రీమియం ప్లాన్. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఆస్తుల కొనుగోలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను రూపొందించారు.

పాలసీ లక్షణాలు

LIC జీవన్ లాభ్ ప్లాన్ లాభం, రక్షణ రెండింటినీ అందిస్తుంది. 8 నుంచి 59 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని సులభంగా తీసుకోవచ్చు. పాలసీ వ్యవధి 16 నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది. కనీసం రూ.2 లక్షల హామీ మొత్తాన్ని తీసుకోవాలి. గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. 3 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లింపుపై రుణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రీమియంపై పన్ను మినహాయింపు, పాలసీ హోల్డర్ మరణంపై నామినీకి సమ్ అష్యూర్డ్, బోనస్ ప్రయోజనాలు లభిస్తాయి.

పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించినట్లయితే నామినీకి డెత్ బెనిఫిట్‌గా డెత్ సమ్ అష్యూర్డ్, సింపుల్ రివర్షనరీ బోనస్, ఫైనల్ అడిషన్ బోనస్ లభిస్తాయి. అంటే నామినీకి అదనపు బీమా మొత్తం లభిస్తుంది.

Tags:    

Similar News