ఎల్‌ఐసీ నుంచి సరికొత్త పాలసీ.. సులువుగా ధనవంతులవుతారు..!

Lic Jeevan Azad Policy: ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ.

Update: 2023-01-22 16:00 GMT

ఎల్‌ఐసీ నుంచి సరికొత్త పాలసీ.. సులువుగా ధనవంతులవుతారు..!

Lic Jeevan Azad Policy: ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఇది అన్ని వర్గాల వారికి అనువైన పాలసీలని రూపొందిస్తుంది. తాజాగా కొత్త ఎండోమెంట్ ప్లాన్ 'జీవన్ ఆజాద్'ని ప్రవేశపెట్టింది . ఈ వ్యక్తిగత బీమా పథకంలో ప్రజలు పొదుపు చేసే అవకాశాన్ని పొందుతారు. ఇందులో రూ.5 లక్షల వరకు బీమా తీసుకునే సౌకర్యం ఉంటుంది. జీవన్ ఆజాద్ ప్లాన్ అనేది వ్యక్తిగత బీమా పథకం. ఇందులో బీమా చేసిన వ్యక్తి మెచ్యూరిటీ వ్యవధి వరకు జీవిత బీమా సౌకర్యాన్ని పొందుతాడు. అదే సమయంలో ఎండోమెంట్ ప్లాన్ లాగా మెచ్యూరిటీపై స్థిర మొత్తం అందుతుంది. బీమా చేసిన వ్యక్తి పాలసీ వ్యవధిలో మరణిస్తే అతను మరణ ప్రయోజనాలను పొందుతాడు.

ఈ ప్లాన్ కింద కనీస హామీ మొత్తం రూ.2 లక్షలు. గరిష్ట బీమా మొత్తం రూ.5 లక్షలు. రూ.3 లక్షల వరకు బీమా చేసినట్లయితే ఆ వ్యక్తి ఎలాంటి వైద్య పరీక్ష చేయించుకోనవసరం లేదు. అయితే అంతకంటే ఎక్కువ మొత్తానికి వైద్య పరీక్ష అవసరం. 90 రోజుల వయస్సు నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి ఈ బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు. జీవన్ ఆజాద్ పాలసీలో కనీస మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు గరిష్టంగా 20 సంవత్సరాలు.

ఈ పాలసీని 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తీసుకుంటే వారి రిస్క్ కవర్ పాలసీ ప్రారంభించిన తేదీ నుంచి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత లేదా 8 సంవత్సరాల వయస్సు పూర్తయిన తర్వాత వర్తిస్తుంది. ఈ పాలసీని పిల్లల పేరుతో తీసుకుంటే మెచ్యూరిటీ కనీస వయస్సు 18 సంవత్సరాలు. పెద్దలకు మెచ్యూరిటీ గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు. ఈ పాలసీకి ప్రీమియం నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు. వ్యక్తి కావాలనుకుంటే అతను కార్డ్, ఆన్‌లైన్, చెక్ లేదా UPI ద్వారా చెల్లించవచ్చు.

ఈ ప్లాన్‌లో పాలసీ టర్మ్ నుంచి 8 ఏళ్లు తీసివేసిన తర్వాత ప్రీమియం చెల్లింపు కాలం నిర్ణయిస్తారు. ఉదాహరణకు మీరు 20 సంవత్సరాల కాలానికి బీమా తీసుకుంటే 12 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించాలి. మీ పాలసీ 15 ఏళ్లు అయితే 7 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి మెచ్యూరిటీ వ్యవధిని పూర్తి చేసినట్లయితే ముగింపులో అతను పూర్తి హామీ మొత్తాన్ని పొందుతాడు. అంటే కనిష్టంగా 2 లక్షలు, గరిష్టంగా 5 లక్షల రూపాయలు పొందుతాడు.

పాలసీ వ్యవధిలో అతను మరణిస్తే అతని నామినీకి హామీ మొత్తం లభిస్తుంది. మరణించిన సందర్భంలో నామినీ స్వీకరించిన మొత్తం హామీ ఇచ్చిన మొత్తానికి సమానంగా ఉంటుంది. అంటే హామీ మొత్తం కంటే ఎక్కువ లేదా వార్షిక ప్రీమియం 7 రెట్లుగా ఉంటుంది. ఈ సందర్భంలో నామినీకి చెల్లించాల్సిన చెల్లింపు తప్పనిసరిగా బీమా చేసిన వ్యక్తి మరణించే వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలలో కనీసం 105 శాతం ఉండాలి. పిల్లల విషయంలో మరణం సంభవించినట్లయితే బీమా చేసిన వ్యక్తికి మొత్తం ప్రీమియం వాపసు చేస్తారు.

Tags:    

Similar News