LIC Policy: ప్రతిరోజు రూ.108 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై రూ.23 లక్షలు పొందండి..!

LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద బీమా కంపెనీ.

Update: 2022-04-20 11:02 GMT

LIC Policy: ప్రతిరోజు రూ.108 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై రూ.23 లక్షలు పొందండి..!

LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద బీమా కంపెనీ. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇందులో డబ్బును పెట్టుబడిగా పెట్టి భవిష్యత్‌ని సురక్షితం చేసుకుంటున్నారు. LICలో పెట్టుబడి పెట్టడం వల్ల అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే పెట్టుబడిదారులకు మెరుగైన రాబడిని అందిస్తుంది. ఈ ప్లాన్ పాలసీ ఎండోమెంట్, లైఫ్ ప్లాన్ కలయికతో రూపొందించారు. ఈ పాలసీలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా పాలసీ ముగిసే సమయానికి మీరు ఖచ్చితంగా రాబడిని పొందుతారు. దీంతో పాటు మీరు లైఫ్‌టైమ్ ఇన్సూరెన్స్‌ కవర్ పొందుతారు.

LIC జీవన్ ఆనంద్ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మెరుగైన రాబడిని పొందుతారు. దీంతో పాటు బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పాలసీలో మీరు బీమా హామీ మొత్తంలో దాదాపు 125 శాతం లైఫ్ కవర్ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడిదారుడు మొత్తం కనీస హామీ మొత్తం రూ.1 లక్ష పొందుతారు. గరిష్ట హామీ మొత్తంపై పరిమితి లేదు. మీ వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటే మీరు ఈ పాలసీలో పెట్టుబడి పెట్టవచ్చు.

మీరు 47 సంవత్సరాల వయస్సులో ఈ పాలసీని కొనుగోలు చేసినట్లయితే కాలపరిమితి 27 సంవత్సరాలు ఉంటుంది. రూ. 8 లక్షల హామీ మొత్తాన్ని తీసుకున్నట్లయితే రూ.39,736 ప్రీమియం చెల్లించాలి. ఇది వార్షిక ప్రీమియం అవుతుంది. అంటే ప్రతిరోజు రూ.108 రూపాయలు అవుతుంది. మొదటి సంవత్సరంలో బీమా చేసిన వ్యక్తి రూ. 40,611 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 27 సంవత్సరాల తర్వాత పాలసీదారు దాదాపు రూ. 23.29 లక్షలు పొందుతారు. ఈ మొత్తంతో పాటు రూ. 8 లక్షల లైఫ్ టైమ్ రిస్క్ కవర్ కూడా అందుబాటులో ఉండటం విశేషం.

Tags:    

Similar News