LIC IPO: మే 4 న ఎల్‌ఐసీ ఐపీవో ప్రారంభం.. షేర్ ధర ఎంత ఉంటుందంటే..!
LIC IPO: మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా IPO కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇక మీ నిరీక్షణ ముగియనుంది.
LIC IPO: మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా IPO కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇక మీ నిరీక్షణ ముగియనుంది. LIC IPO మే 4న ప్రారంభిస్తున్నారు. మే 9, 2022న ముగుస్తుంది. దేశంలోనే అతిపెద్ద IPO గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. IPOలో పెట్టుబడి పెట్టే రిటైల్ పెట్టుబడిదారులకు తగ్గింపు ఉంటుంది. IPOలో పెట్టుబడి పెట్టే పాలసీదారులకు 10% వరకు తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. అలాగే LIC IPO ఇష్యూ ధర ఒక్కో షేరుకు 940గా ఉంటుందని అంచనా.
IPOలో LIC విలువ 6 లక్షల కోట్లు
IPO ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో 3.5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఖజానాకు రూ.21,000 కోట్లు రానున్నాయి. ఐపీఓలో ఎల్‌ఐసీ విలువ రూ.6 లక్షల కోట్లు. మార్చిలోగా ఎల్‌ఐసీ ఐపీఓను ప్రారంభించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందుగా ప్రణాళిక వేసింది. కానీ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
ఇంతకుముందు ప్రభుత్వం ఎల్‌ఐసిలో 5% వాటాను విక్రయిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అది 3.5% మాత్రమే అని తెలుస్తోంది. మార్కెట్‌లో డిమాండ్ బాగుంటే ప్రభుత్వం 5% పెంచవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఫిబ్రవరిలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి LIC ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. రూ.12 లక్షల కోట్ల మార్కెట్ విలువతో దాదాపు రూ.65,000 కోట్లు సమీకరించాలన్నది వీరి లక్ష్యం. ఎందుకంటే అది తన 5 శాతం వాటాను తగ్గిస్తుంది. రూ. 21,000 కోట్ల IPO ఇప్పటివరకు అతిపెద్దది.