LIC IPO: ఈ నెల చివరి వారంలో ఎల్‌ఐసీ ఐపీవో..!
LIC IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీఓ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు...
LIC IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీఓ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. LIC తన IPOను ఏప్రిల్ 25 నుంచి 29 మధ్య ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎల్‌ఐసి ఏప్రిల్ 13న తన యుడిఆర్‌హెచ్‌పి (అప్‌డేటెడ్ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్)ని సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి దాఖలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం మార్చిలోనే ఎల్‌ఐసి ఐపిఓను ప్రారంభించాల్సి ఉంది. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మధ్య ప్రపంచ మార్కెట్‌లో అమ్మకాల కారణంగా ఈ నిర్ణయం వాయిదా పడింది.
ఇప్పుడు మార్కెట్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం త్వరలో LIC IPO తీసుకువస్తుందని అందరు భావిస్తున్నారు. LIP IPO ద్వారా ప్రభుత్వం 5 నుంచి 6.5 శాతం వాటాను విక్రయించవచ్చు. ఎల్‌ఐసి ఐపిఒ ద్వారా రూ.50,000 నుంచి 60,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. LIC ఇటీవల ఫిబ్రవరిలో మార్కెట్ రెగ్యులేటర్‌కు డ్రాఫ్ట్ పేపర్‌లను దాఖలు చేసింది. ఈ ముసాయిదా ప్రకారం ఎల్‌ఐసీ 632 కోట్ల షేర్లలో 31,62,49,885 ఈక్విటీ షేర్లను విక్రయించాలని ప్రతిపాదించారు.
ఇందులో 50 శాతం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారులకు (QIBలు) రిజర్వ్ చేస్తారు. అయితే ఇది సంస్థాగత కొనుగోలుదారులకు 15 శాతం ఉంటుంది. ఇప్పుడు LIC IPO SEBIచే ఆమోదించిన తర్వాత 12 నెలల కాలానికి చెల్లుబాటు అవుతుంది. కేబినెట్ సమావేశంలో ఎల్‌ఐసీ ఐపీఓకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆటోమేటిక్ రూట్‌లో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐఇ) అనుమతించారు. మార్కెట్ వాతావరణం క్షీణిస్తున్న దృష్ట్యా విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం ప్రారంభించారు.
పాలసీ హోల్డర్స్ ఉద్యోగుల షేర్ రిజర్వ్
LIC పాలసీ హోల్డర్లు, కంపెనీ ఉద్యోగుల కోసం వాటా రిజర్వ్ చేశారు. సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రం ప్రకారం.. ఇష్యూలో 10 శాతం పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేశారు. అంటే మీ LIC పాలసీ ల్యాప్ అయినప్పటికీ మీరు ఇప్పటికీ రిజర్వ్ కోటాలో వేలం వేయవచ్చు. ఇది కాకుండా ఎల్‌ఐసి ఉద్యోగులకు 5 శాతం వాటా రిజర్వ్ చేశారు.