LIC IPO: రికార్డులు తిరగరాసిన ఎల్‌ఐసీ ఐపీవో

LIC IPO: దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎల్‌ఐసీ ఐపీవో ప్రారంభంలోనే అనేక రికార్డులను తిరగరాసి చరిత్ర సృష్టించింది.

Update: 2022-05-04 15:45 GMT

LIC IPO: రికార్డులు తిరగరాసిన ఎల్‌ఐసీ ఐపీవో

LIC IPO: దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎల్‌ఐసీ ఐపీవో ప్రారంభంలోనే అనేక రికార్డులను తిరగరాసి చరిత్ర సృష్టించింది. ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఐపీవో ఆరంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ నుంచి 5,620 కోట్లను LIC సమీకరించింది. ఇష్యూలో భాగంగా LICలో 3.5 శాతం వాటాకు సమానమైన 22 కోట్లు, 13 లక్షల షేర్లను విక్రయించి 20వేలు, 557 కోట్లను సమీకరించాలని కేంద్రం ప్లాన్ చేసింది. ఈ ఇష్యూ ఈ నెల 9న ముగియనుంది. ఈనెల 17న స్టాక్ ఎక్సేంజ్ లలో ఎల్ఐసీ లిస్ట్ కానుంది. మరోవైపు LIC IPOకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులోని కోయంబత్తూరులో LIC ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు.

Tags:    

Similar News