ఎల్‌ఐసీ కస్టమర్లకి శుభవార్త.. IPOకి సెబీ ఆమోదం.. ఇప్పుడు వాయిదా ఉండదు..!

ఎల్‌ఐసీ కస్టమర్లకి శుభవార్త.. IPOకి సెబీ ఆమోదం.. ఇప్పుడు వాయిదా ఉండదు..!

Update: 2022-03-10 08:15 GMT

ఎల్‌ఐసీ కస్టమర్లకి శుభవార్త.. IPOకి సెబీ ఆమోదం.. ఇప్పుడు వాయిదా ఉండదు..!

LIC IPO: చాలా కాలంగా ఎల్‌ఐసీ ఐపీఓ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకి ఇది మంచివార్త అవుతంది. ఇప్పుడు ఎల్‌ఐసీ ఐపీఓ రాకపై ఊహాగానాలకు దాదాపు తెరపడింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కేవలం 22 రోజుల్లోనే ఎల్‌ఐసీ ఐపీఓకు ఆమోదం తెలిపింది. సాధారణంగా ఆమోదం పొందడానికి 75 రోజులు పడుతుంది. ఇంతకు ముందు సెబీ ఇంత త్వరగా ఏ IPOని ఆమోదించలేదు. వాస్తవానికి రష్యా-ఉక్రెయిన్ వార్ కారణంగా ఈఐపీఓ వాయిదా పడనుందని అందరు భావిస్తున్నారు. ఎందుకంటే యుద్దం ఎఫెక్ట్‌ మార్కెట్‌పై ఉంటుంది. దీని కారణంగా LIC IPO వచ్చే ఏడాదికి వాయిదా వేయాలనే చర్చ జరిగింది. ఈ ఐపీఓ ద్వారా రూ.60,000 కోట్లుసమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

LIC ఇటీవలే ఫిబ్రవరిలో మార్కెట్ రెగ్యులేటర్‌కు డ్రాఫ్ట్ పేపర్‌లను దాఖలు చేసింది. ఈ ముసాయిదా ప్రకారం ఎల్‌ఐసీ మొత్తం 632 కోట్ల షేర్లలో 31,62,49,885 ఈక్విటీ షేర్లను విక్రయించాలని ప్రతిపాదించింది. ఇందులో 50 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు (QIBలు) రిజర్వ్ చేస్తారు. అయితే ఇది నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు 15 శాతం ఉంటుంది.

మార్కెట్‌లో అమ్మకాల కారణంగా పెద్ద పెట్టుబడి బ్యాంకులు ఎల్‌ఐసి ఐపిఓలో డబ్బును పెట్టి లిస్టింగ్‌ను వాయిదా వేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ కారణంగా ప్రస్తుతం మార్కెట్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. దీని ప్రభావం ఎల్‌ఐసి ఐపిఓపై కూడా పడనుంది. ఇప్పుడు LIC IPO SEBI ఆమోదం తర్వాత ఈ IPO 12 నెలల కాలానికి చెల్లుబాటు అవుతుంది. కేబినెట్‌ సమావేశంలో ఎల్‌ఐసీ ఐపీఓకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆటోమేటిక్ రూట్‌లో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐఇ) అనుమతి ఉంటుంది.

Tags:    

Similar News