LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో ఎవరికి ఎన్ని షేర్స్ కేటాయించారో తెలుసా..?
LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో ఎవరికి ఎన్ని షేర్స్ కేటాయించారో తెలుసా..?
LIC IPO: ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో ఐపీఓ హవా నడుస్తోంది. అందుకే ఒకదాని తర్వాత ఒకటి పెద్ద కంపెనీలు ఐపిఓను ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఎల్‌ఐసీ ఐపీఓ కోసం రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి పత్రాలు కూడా సమర్పించారు. ఫిబ్రవరి 13 ఆదివారం ప్రభుత్వం SEBIకి DRHP దాఖలు చేసింది. ఎల్‌ఐసి పాలసీ హోల్డర్లు కూడా ఈ ఐపిఓలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎందుకంటే ఇందులో 10 శాతం వారికి రిజర్వ్ చేస్తారు. అంటే పాలసీదారుల్లో వాటాలు పొందే అవకాశాలు పెరుగుతాయి. ఇది కాకుండా వారు తగ్గింపును కూడా పొందవచ్చు.
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎల్‌ఐసి పాలసీ హోల్డర్‌లు, కంపెనీ ఉద్యోగుల కోసం షేర్ రిజర్వ్ చేసినట్లు IPO స్పష్టం చేసింది. ఈ రెండు వర్గాలకు LIC రాయితీ ఇస్తుంది. నివేదిక ప్రకారం సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రం ప్రకారం ఇష్యూలో 10 శాతం పాలసీ హోల్డర్లకు రిజర్వ్ చేశారు. అంటే మీ LIC పాలసీ ల్యాప్ అయినప్పటికీ మీరు ఇప్పటికీ రిజర్వ్ కోటాలో వేలం వేయవచ్చు. ఇది కాకుండా ఎల్‌ఐసి ఉద్యోగులకు 5 శాతం వాటా రిజర్వ్ చేశారు.
ఎల్‌ఐసీ యాజమాన్యం ఇప్పటికీ ప్రభుత్వం వద్దే ఉండడం గమనార్హం. అంటే ఇప్పుడు అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. ఇది దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన వాటాలను విక్రయించడం ద్వారా దాదాపు రూ.90,000 కోట్లు సమీకరించాలనుకుంటోంది. ప్రభుత్వం తన వాటాను విక్రయించడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోగలదు. ఇది కాకుండా IPO తర్వాత కూడా LIC ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుంది. చట్టం ప్రకారం LICలో ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తక్కువ ఉండకూడదు. 5 సంవత్సరాలలో LICలో ప్రభుత్వం తన వాటాలో 25 శాతానికి మించి విక్రయించకూడదు.