LIC Housing Finance: ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ ఇప్పుడు ఖరీదైనది.. ఈఎంఐలో పెరుగుదల..!

LIC Housing Finance: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచిన తర్వాత చాలా బ్యాంకులు...

Update: 2022-05-17 05:18 GMT

LIC Housing Finance: ఎల్‌ఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ ఇప్పుడు ఖరీదైనది.. ఈఎంఐలో పెరుగుదల..!

LIC Housing Finance: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచిన తర్వాత చాలా బ్యాంకులు తమ గృహ రుణాలను ఒక్కొక్కటిగా ఖరీదైనవిగా చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సి నుంచి ఐసీఐసీఐ వరకు అన్ని బ్యాంకులు గృహరుణాలని ఖరీదైనవిగా మార్చుతున్నాయి. ఇప్పుడు ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్‌ఐసి హెచ్‌ఎఫ్‌ఎల్) కూడా వారి జాబితాలో చేరింది. తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సిబిల్ స్కోర్ ఆధారంగా గృహ రుణ వడ్డీ రేట్లను పెంచింది.

నివేదిక ప్రకారం మంచి క్రెడిట్ స్కోర్‌లు ఉన్న కస్టమర్‌ల కోసం గృహ రుణాల ప్రారంభ రేట్లు 20 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో కొత్త రేటు 6.9 శాతానికి పెరిగింది. 700 సిబిల్‌ స్కోరు కంటే తక్కువ ఉన్న కస్టమర్ల కోసం 25 బేసిస్ పాయింట్లని పెంచింది. అలాగే క్రెడిట్ కస్టమర్లకు గృహ రుణ రేట్లు 40 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేట్లు మే 13 శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంటే ముందు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, కరూర్‌ వైశ్యా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా రుణాలను ఖరీదైనవిగా మార్చాయి.

వాస్తవానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను పెంచడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. RBI గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మే 2020 నుంచి రెపో రేట్లు 40 bps నుంచి 4.40 శాతానికి పెంచారు. రానున్న రోజుల్లో కూడా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 0.75 శాతం వరకు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం ప్రజలకి ఈఎంఐ భారం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News