LIC: ఎల్‌ఐసీ కస్టమర్లకి శుభవార్త.. ఈ రెండు పాలసీలలో మార్పులు..!

LIC: ఎల్‌ఐసి న్యూ జీవన్ అమర్, ఎల్‌ఐసి న్యూ టెక్ టర్మ్ ప్లాన్‌లను కొత్త పద్ధతిలో ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది.

Update: 2022-11-25 06:18 GMT

LIC: ఎల్‌ఐసీ కస్టమర్లకి శుభవార్త.. ఈ రెండు పాలసీలలో మార్పులు..!

LIC: ఎల్‌ఐసీ పాలసీదారులకి శుభావార్త. కంపెనీ రెండు ఫేమస్‌ పాత ప్లాన్లని కొత్త రూపంలో ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసి న్యూ జీవన్ అమర్, ఎల్‌ఐసి న్యూ టెక్ టర్మ్ ప్లాన్‌లను కొత్త పద్ధతిలో ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. ఎల్‌ఐసీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో దీని గురించి సమాచారం ఇచ్చింది. రెండు ప్లాన్‌లు నాన్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, పర్సనల్‌, ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అని తెలిపింది.

ఎల్‌ఐసి జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ రెండు ప్లాన్‌లు 3 సంవత్సరాల క్రితం మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు వాటిని మరోసారి రీలాంచ్ చేస్తున్నారు. ఈ రెండు టర్మ్ ప్లాన్‌లను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీల గురించి మరింత సమాచారం కోసం కంపెనీ అధికారిక లింక్ www.licindia.inని సందర్శించవచ్చు. పాలసీ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

1. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వారు ఇందులో పాల్గొనవచ్చు.

2. ఇందులో గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 80 సంవత్సరాలు.

3. అయితే పాలసీ వ్యవధి 10 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది.

4. ఈ ప్లాన్‌లలో మహిళలకు ప్రత్యేక ధరలు అందిస్తారు.

5. ఇది కాకుండా ధూమపానం చేసేవారికి, ధూమపానం చేయనివారికి వేర్వేరు రేట్లు ఉన్నాయి.

ప్రీమియం ఎప్పుడు చెల్లించాలి?

ఈ రెండు పాలసీలలో కస్టమర్లు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక, వార్షిక ప్రాతిపదికన ప్రీమియం చెల్లించాలి. 5 వేలు, 15 వేలు, 25 వేలు, 50 వేల రూపంలో కస్టమర్లు ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News