LIC Policy: ఎల్‌ఐసీ సూపర్ హిట్ ప్లాన్‌ .. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించండి..!

Lic Policy: నేటి కాలంలో డిపాజిట్లు, పెట్టుబడులపై వడ్డీరేట్లు తక్కువగా ఉన్నాయి.

Update: 2022-06-06 06:30 GMT

LIC Policy: ఎల్‌ఐసీ సూపర్ హిట్ ప్లాన్‌ .. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించండి..!

Lic Policy: నేటి కాలంలో డిపాజిట్లు, పెట్టుబడులపై వడ్డీరేట్లు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎల్‌ఐసీ అద్భుత పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో రిస్క్ కవర్‌తో పాటు ప్రతి సంవత్సరం గ్యారెంటీ రిటర్న్ ఉంటుంది. పాలసీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎల్‌ఐసీ ప్రవేశపెట్టిన ఈ పాలసీ పేరు బీమా జ్యోతి. దీని కింద బీమా చేసిన వ్యక్తికి ప్రతి సంవత్సరం గ్యారెంటీ పెంపు ఇస్తామని చెబుతున్నారు. 'మీ ఉజ్వల భవిష్యత్తుకు గ్యారంటీడ్ కీ' అనే ట్యాగ్‌లైన్‌తో ఎల్‌ఐసీ ఈ పాలసీని ప్రవేశపెట్టింది.

ఇది నాన్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత పొదుపు ప్లాన్. ఇన్వెస్ట్‌మెంట్‌లపై వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలో బీమా జ్యోతిపై ఎల్‌ఐసి రిస్క్ కవర్‌తో ప్రతి సంవత్సరం గ్యారెంటీ పెంచడం గొప్ప ఆకర్షణ. ఈ పాలసీని ఆఫ్‌లైన్‌లో ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందులో బేసిక్ సమ్ అష్యూర్డ్ ఒక లక్ష రూపాయలు. అంటే కనీసం రూ.లక్ష పాలసీ తీసుకోవచ్చు. అదే సమయంలో పాలసీ గరిష్ట హామీ మొత్తం ఇంకా నిర్ణయించలేదు.

ఎల్‌ఐసీ బీమా జ్యోతి పాలసీని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. పాలసీదారుని కనీస వయస్సు 90 రోజులు. గరిష్టంగా 60 సంవత్సరాలు ఉండాలి. సమ్ అష్యూర్డ్ కనిష్టంగా 1 లక్ష రూపాయలు. గరిష్ట హామీ మొత్తంపై పరిమితి లేదు. పాలసీ టర్మ్ 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కొనుగోలు చేయవచ్చు. పాలసీ టర్మ్ కంటే 5 ఏళ్లు తక్కువ అంటే పాలసీ టర్మ్ 20 ఏళ్లు అయితే 15 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ప్రతి సంవత్సరం రూ. 50 చొప్పున గ్యారెంటీడ్ రిటర్న్ క్లెయిమ్ చేస్తారు. ఇది వ్యక్తి మెచ్యూరిటీ లేదా మరణించే వరకు ప్రతి పాలసీ సంవత్సరం చివరిలో కలుపుతారు. ప్రీమియం వార్షిక, అర్ధ సంవత్సరం, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన చెల్లించవచ్చు. నెలవారీ ప్రీమియం NACH (నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్) ద్వారా లేదా జీతం నుంచి కట్‌ అవుతుంది. ఈ పాలసీ ద్వారా రుణ సౌకర్యం కూడా లభిస్తుంది.

Also Read

Post Office: పోస్టాఫీస్‌ సూపర్ స్కీం.. నెలకి రూ.1500 చెల్లిస్తే రూ.35 లక్షలు మీవే..!

Tags:    

Similar News