Financial Tips: ధనవంతులు కావడానికి 3 మార్గాలు.. అవగాహన ఉంటే అయిపోతారు..!

Financial Tips: ధనవంతులు కావడానికి ముఖ్యంగా రెండు విషయాలు తెలిసి ఉండాలి. సంపాదించిన దానిలో తక్కువగా ఖర్చు చేయడం అలాగే వీలైనంత ఎక్కువగా పొదుపు చేయడం.

Update: 2023-07-19 15:30 GMT

Financial Tips: ధనవంతులు కావడానికి 3 మార్గాలు.. అవగాహన ఉంటే అయిపోతారు..!

Financial Tips: ధనవంతులు కావడానికి ముఖ్యంగా రెండు విషయాలు తెలిసి ఉండాలి. సంపాదించిన దానిలో తక్కువగా ఖర్చు చేయడం అలాగే వీలైనంత ఎక్కువగా పొదుపు చేయడం. ఈ రెండిటిపై పట్టు సాధిస్తే సులువుగా ధనవంతులు కావొచ్చు. కానీ ఇది అనుకున్నంత సులువు కాదు. ఇందుకోసం కొన్ని విషయాలని గమనించాలి. ముందుగా డబ్బు సంపాదించడానికి మార్గాలు తెలిసి ఉండాలి. అలాగే కొన్ని నియమాలని పాటించాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

రుణాలు ఉండకూడదు

వాస్తవానికి అన్ని అప్పులు చెడ్డవి కావు. కానీ ధనవంతులు కావాలంటే మాత్రం ఎటువంటి రుణాలు ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో వీటికి చెల్లించే వడ్డీ ఎక్కువగా ఉంది. దీనివల్ల సంపాదించిన దానిలో అధిక శాతం వడ్డీలకే వెళితే పొదుపు తగ్గుతుంది. దీంతో మీ లక్ష్యం నెరవేరదు. అందుకే ముందుగా అధిక వడ్డీ ఉండే రుణాలని చెల్లించి తర్వాత మిగిలిన రుణాలని క్లియర్ చేసుకోవాలి.

పెట్టుబడుల్లో మార్పులు

పెట్టుబడులు అనేవి ఎప్పుడూ ఒకే చోట ఉంచవద్దు. తరచు మారుస్తే ఉండాలి. ఎందుకంటే ధనవంతులు కావడానికి విభిన్నమైన పోర్ట్‌ఫోలియోను పాటించడం తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. ఒకే రకమైన పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు వచ్చినప్పుడు దివాళ తీసే పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే డబ్బును వేర్వేరు ప్రదేశాల్లో, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఇది మీ లక్ష్యాన్ని దగ్గర చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఆదాయాన్ని పెంచుకోండి

మీరు ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత తొందరగా ధనవంతులు కావొచ్చు.

సంపాదన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం వల్ల ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తారు. ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల లక్ష్యాన్ని తొందరగా సాధిస్తారు. ఇందుకోసం వ్యాపారాలలో మార్పులు చేసుకోవాలి. అవసరమైతే కెరీర్‌లలో కూడా మార్పులు చేయాలి. ఎలా చేసిన అధిక సంపాదనే లక్ష్యంగా పనిచేయాలి. అప్పుడే మీ టార్గెట్‌ని చేరుకుంటారు.

Tags:    

Similar News