Kotak Mahindra Bank: ఎఫ్డీ రేటుని పెంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్..?
Kotak Mahindra Bank: ఎఫ్డీ రేటుని పెంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్..?
Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేటును పెంచింది . ఈ పెరుగుదల 2 నుంచి 10 సంవత్సరాల FDలకి వర్తిస్తుంది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై ఎఫ్‌డీ రేటు పెంచారు. కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు సెప్టెంబర్ 19, 2022 నుంచి అమలులోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచినప్పటి నుంచి FD రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నెలాఖరులో రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మళ్లీ పెంచే అవకాశాలు ఉన్నాయి.
కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకారం.. 2 నుంచి 10 సంవత్సరాల FDలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. 7 నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై 2.50 శాతం నుంచి 6.10 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఈ రేటు సాధారణ ప్రజలకు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం నుంచి 6.60 శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ FD రేట్లు
అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ 15 నుంచి 30 రోజుల FDలపై 2.65 శాతం వడ్డీని కొనసాగిస్తుంది. అదేవిధంగా 7 నుంచి 14 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై 2.50 శాతం వడ్డీ అందుబాటులో ఉంటుంది. 31 నుంచి 90 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై 3.25% వడ్డీ రేటును కొనసాగిస్తుంది. అయితే బ్యాంక్ 91 నుంచి 179 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై 3.75% ప్రస్తుత వడ్డీ రేటును కొనసాగిస్తోంది. 180 నుంచి 363 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై 5.00% చొప్పున వడ్డీని చెల్లిస్తుంది.
అలాగే 365 రోజుల నుంచి 389 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 5.75% వడ్డీ రేటును కొనసాగిస్తుంది. 23 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు మెచ్యూరిటీ ఉన్న FDలు 6.10 శాతం వడ్డీని చెల్లిస్తూనే ఉంటాయి. అయితే 2 సంవత్సరాల, 10 సంవత్సరాల కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న FDలకు ఇప్పుడు 6.10 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇంతకుముందు వీటిపై 6% వడ్డీ మాత్రమే అందుబాటులో ఉండేది. దీనిని 10 బేసిస్ పాయింట్లు పెంచారు.