ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేవారికి బంపర్‌ ఆఫర్.. ఈ బ్యాంకులో మరింత వడ్డీ..!

*ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేవారికి బంపర్‌ ఆఫర్.. ఈ బ్యాంకులో మరింత వడ్డీ..!

Update: 2022-12-18 15:30 GMT

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసేవారికి బంపర్‌ ఆఫర్.. ఈ బ్యాంకులో మరింత వడ్డీ..!

Kotak Mahindra Bank: భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచింది. దీంతో EMI పెరిగింది. రుణగ్రహీతలు తీవ్రంగా నష్టపోతున్నారు. అదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వంటి పథకాలలో పెట్టుబడి పెట్టేవారు మాత్రం ప్రయోజనం పొందుతున్నారు. బ్యాంకులు FD వడ్డీ రేట్లను నిరంతరం పెంచుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ డిసెంబర్ 9, డిసెంబర్ 15 మధ్య FD వడ్డీ రేట్లను మూడు సార్లు పెంచింది.

FDపై 7.5 శాతం వడ్డీ

కోటక్ మహీంద్రా బ్యాంక్ 2 కోట్ల రూపాయల లోపు ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను మళ్లీ పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు దేశీయ డిపాజిట్లతో పాటు NRO,NRE డిపాజిట్లపై వర్తిస్తాయి. కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటి నుంచి 390 రోజుల పాటు FD డిపాజిట్లపై బ్యాంక్ 7 శాతం వడ్డీని చెల్లిస్తుంది. ప్రజలు 23 నెలల వరకు డిపాజిట్లపై అదే వడ్డీని పొందుతారు. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు FD వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 180 రోజుల వరకు FDలపై 5.75 శాతం వరకు వడ్డీ అందుబాటులో ఉంది. ఇంతకుముందు బ్యాంక్ డిసెంబర్ 9, డిసెంబర్ 14 న FDల వడ్డీ రేట్లను పెంచింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు. దీనికి దేశవ్యాప్తంగా 1600 కంటే ఎక్కువ శాఖలు, 2500 కంటే ఎక్కువ ఏటీఎంలు ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్ దీనికి చైర్మన్.

Tags:    

Similar News