ఎల్‌ఐసీ కస్టమర్లకి గమనిక.. పెండింగ్‌ డబ్బులని సులువుగా క్లెయిమ్‌ చేసుకోండి..!

LIC: మీరు ఎల్‌ఐసీ కస్టమర్ అయితే పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని క్లెయిమ్ చేయలేకపోతే ఈ విషయాన్ని తెలుసుకోండి.

Update: 2022-08-01 04:30 GMT

ఎల్‌ఐసీ కస్టమర్లకి గమనిక.. పెండింగ్‌ డబ్బులని సులువుగా క్లెయిమ్‌ చేసుకోండి..!

LIC: మీరు ఎల్‌ఐసీ కస్టమర్ అయితే పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని క్లెయిమ్ చేయలేకపోతే ఈ విషయాన్ని తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఎటువంటి చెల్లింపులు చేయవలసిన అవసరం లేదు. పెండింగ్‌లో ఉన్న దావా లేదా మొత్తాన్ని సులభంగా విత్‌ డ్రా చేసుకోవచ్చు. వాస్తవానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీని తీసుకున్న కొందరు వ్యక్తులు కొన్ని కారణాల వల్ల ఈ డబ్బుని క్లెయిమ్‌ చేసుకోలేకపోతారు. అలాంటి వ్యక్తుల కోసం ఎల్‌ఐసీ క్లెయిమ్ చేసే మార్గాల గురించి వివరించింది.

ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ లేదా బకాయిల వివరాలను సులభంగా తనిఖీ చేయవచ్చు. ఇందుకోసం కస్టమర్ లేదా అతని నామినీ ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్, licindia.in ని సందర్శించాలి. ఇక్కడ మీరు పాలసీ నంబర్, పాలసీదారు పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నంబర్ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు బకాయి ఉన్న క్లెయిమ్‌లను తనిఖీ చేసే సదుపాయాన్ని పొందుతారు.

మీరు తనిఖీ చేసిన తర్వాత విత్‌ డ్రా చేయల్సిన డబ్బులు ఉంటే ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ పెండింగ్ మొత్తాన్ని విత్‌ డ్రా చేసేందుకు దరఖాస్తును సమర్పించాలి. తర్వాత KYC మొదలైన వాటిని పూర్తి చేయాలి. అప్పుడు అన్‌క్లెయిమ్ చేయని మొత్తం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. KYC లేకుండా పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని ఎల్‌ఐసీ విడుదల చేయదని గుర్తుంచుకోండి. మీరు క్లెయిమ్ చేయని మొత్తం గురించి తెలుసుకోవడానికి ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌కి వెళ్లినప్పుడు, పాలసీ నంబర్, పాన్ కార్డ్ నంబర్‌ను అందించడం ఐచ్ఛికమని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News