Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటే కలిగే నష్టాలు ఇవే..!

Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటే కలిగే నష్టాలు ఇవే..!

Update: 2022-10-05 15:00 GMT

Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటే కలిగే నష్టాలు ఇవే..!

Second Hand Car: భారతదేశంలో సెకండ్‌ హాండ్ల కార్లకి మార్కెట్ భారీగా ఉంది. కొత్త కారు కొనడానికి చాలా కాలం వేచి ఉండటం లేదా డబ్బు సరిపోకపోవడంతో చాలామంది పాత కారు లేదా కొద్దిగా ఉపయోగించిన కారు కొనడానికి ఇష్టపడతారు. ఇటీవల పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపయోగించిన కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇది కాకుండా కొత్త వాహనంతో పోలిస్తే ఇది తక్కువలో వస్తుంది. అయితే పాత కార్లకు కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం అవసరం.

1. మెయింటనెన్స్‌ ఖర్చు

వాహనం పాతదయ్యే కొద్దీ దాని మెయింటనెన్స్‌ ఖర్చు కూడా పెరుగుతుంది. పాత కారు అనేక భాగాలను మార్చవలసి ఉంటుంది. కాబట్టి నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువవుతుంది.

2. తక్కువ మైలేజీ

పాత ఓనర్ కారును బాగా నడపకపోతే అందులో మైలేజీ కూడా తక్కువగానే వస్తుంది. ఈ పరిస్థితిలో మీరు ఇంధన భారాన్ని భరించవలసి ఉంటుంది. అంటే మీ పాకెట్ మనీ పెరుగుతుంది.

3. అధిక వడ్డీ రేటు

మీరు EMIలో సెకండ్ హ్యాండ్ కారును తీసుకుంటే మరింత నష్టపోతారు. కొత్త కారుతో పోలిస్తే ఉపయోగించిన కారు రుణంపై బ్యాంకులు సాధారణంగా అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి.

4. మోసం చేసే ప్రమాదం

చాలా సార్లు పాత కారు అమ్మేటప్పుడు పాత యజమాని మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంటుంది. బయటి నుంచి కారుని అందంగా కనిపించేలా డెకరేషన్‌ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు.

5. సరైన ఎంపిక ఉండదు

మీరు కొత్త వాహనం కోసం వెళితే ప్రతి బడ్జెట్ పరిధిలో అనేక రంగులు, ఎంపికలు చూస్తారు. కానీ పాత వాహనంలో చాలా పరిమిత ఎంపికలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇది కాకుండా మీకి నచ్చిన రంగుని కొనుగోలు చేయలేరు.

Tags:    

Similar News