Higher Interest: బ్యాంకు ఎఫ్డీ కంటే ఈ ప్రభుత్వ పథకంలో అధిక వడ్డీ..!

Higher Interest: దేశంలోని అనేక ప్రభుత్వ,ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచాయి.

Update: 2022-09-03 09:37 GMT

Higher Interest: బ్యాంకు ఎఫ్డీ కంటే ఈ ప్రభుత్వ పథకంలో అధిక వడ్డీ..!

Higher Interest: దేశంలోని అనేక ప్రభుత్వ,ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచాయి. మీరు కూడా ఎఫ్‌డి చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అధిక వడ్డీ ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా ప్రధాన బ్యాంకులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 5.50, ఐసిఐసిఐ బ్యాంక్ 5.50, ఎస్‌బిఐ 5.50,యాక్సిస్ బ్యాంక్ 5.50, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5.60, కిసాన్ వికాస్ పత్ర 6.90 శాతం వడ్డీ అందిస్తోంది. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ గరిష్టంగా 5.50 శాతం నుంచి 5.60 శాతం వరకు వడ్డీ అందిస్తోంది.

అయితే ఇందులో కాకుండా మీరు డబ్బును పోస్టాఫీసులోని కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెడితే వీటికన్నా ఎక్కువ వడ్డీని పొందవచ్చు. కిసాన్ వికాస్ పత్ర ప్రస్తుతం 6.9 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ పథకం వ్యవధి 124 నెలలు అంటే 10 సంవత్సరాల 4 నెలలు. మీరు ఈ స్కీమ్‌లో 1 ఏప్రిల్ 2022 నుంచి 30 జూన్ 2022 వరకు ఇన్వెస్ట్ చేసి ఉంటే మొత్తం 10 సంవత్సరాల 4 నెలల్లో మీ అమౌంట్‌ రెట్టింపు అవుతుంది.

మీరు ఎంత పెట్టుబడి పెట్టవచ్చు..?

కిసాన్ వికాస్ పత్రలో మీరు 1000, 5000, 10000, 50000 డినామినేషన్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది కాకుండా మీరు కిసాన్ వికాస్ పత్రాన్ని తాకట్టుగా లేదా సెక్యూరిటీగా ఉంచడం ద్వారా రుణం తీసుకోవచ్చు. మీరు చిన్న పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభం పొందాలనుకుంటే పోస్టాఫీసు మంచి ఎంపిక. ఇందులో అన్ని వర్గాల వారికి సరిపోయే స్కీంలు ఉన్నాయి. ఇంకా మీ డబ్బుకి ప్రభుత్వ రక్షణ కూడా ఉంటుంది.

Tags:    

Similar News