Personal Loan: పర్సనల్ లోన్ తీసుకునేముందు ఈ విషయాలు గమనించండి.. ఎటువంటి సమస్య ఉండదు..!
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకునేముందు ఈ విషయాలు గమనించండి.. ఎటువంటి సమస్య ఉండదు..!
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకునేముందు కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే తర్వాత చాలా ఇబ్బందిపడాల్సి వస్తోంది. వాస్తవానికి అత్యవసర ఆర్థిక అవసరాలను ఎదుర్కోవడానికి వ్యక్తిగత రుణాలు ఉత్తమ ఎంపిక. ఈ రుణాలు చాలా త్వరగా మంజూరవుతాయి. అధిక డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు. అందుకే చాలామంది వ్యక్తిగత రుణాలను తీసుకుంటారు. కానీ వ్యక్తిగత రుణాలపై ఎక్కువ వడ్డీ ఉంటుంది. అయితే వడ్డీరేటు తక్కువగా ఉండే బ్యాంకుని ఎంచుకుంటే మంచిది.
క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండాలి
ఏదైనా భారతీయ బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ కోసం అప్లై చేసే ముందు మంచి క్రెడిట్ స్కోరుని కలిగి ఉండాలి. అప్పుడే వ్యక్తిగత రుణాలు సులువుగా లభిస్తాయి. అంతేకాకుండా మంచి ఆఫర్లు ఇస్తారు. రుణం కోసం బ్యాంకుతో చర్చలు జరిపినప్పుడు మీరు చాలా ప్రయోజనం పొందుతారు.
ఆఫర్ల సద్వినియోగం
బ్యాంకులు నిర్దిష్ట సమయాల్లో కాలానుగుణ ఆఫర్‌లను ప్రకటిస్తాయి. ఈ రకమైన ఆఫర్ల ద్వారా సాధారణ సమయంలో కంటే తక్కువ వడ్డీకి రుణాలు పొందవచ్చు. కానీ ఇవి పరిమిత కాలం వరకు మాత్రమే ఉంటాయి. అందుకే ఆఫర్ల సమయంలో లోన్లు తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.
బ్యాంకుతో సత్సంబంధాలు
బ్యాంకుకు నమ్మకమైన కస్టమర్ అని తెలిసినప్పుడు బ్యాంక్ మీకు మెరుగైన వడ్డీ రేటును అందిస్తుంది. బ్యాంక్‌తో ఉన్న సంబంధాన్ని బట్టి తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాకుండా వివిధ ఆఫర్లని ప్రకటించవచ్చు.
వృత్తిపరమైన విశ్వసనీయత
బ్యాంకులు సాధారణంగా అగ్రశ్రేణి కంపెనీ ఉద్యోగులు మంచి జీతం పొందుతారని రుణం పొందడానికి వారు అర్హులని నమ్ముతాయి. అయితే మీరు అగ్రశ్రేణి కంపెనీలో పనిచేస్తున్నట్లయితే మీ ఆదాయం స్థిరంగా ఉందని బ్యాంకుకు నిరూపించాలి. ఆ తర్వాత రుణంపై మెరుగైన వడ్డీ రేటును పొందే అవకాశం ఉంటుంది.
అనేక బ్యాంకుల వడ్డీ రేట్లు
వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను మీరు సరిపోల్చడం చాలా ముఖ్యం. తర్వాత మీరు తక్కువ వడ్డీ రేటుతో తక్కువ పర్సనల్ లోన్ ఇచ్చే బ్యాంకును ఎంచుకోవాలి. మీరు ఇష్టపడే బ్యాంక్ మీకు డిజిటల్, పేపర్‌లెస్ అప్లికేషన్‌ను అందిస్తే మీరు ఆన్‌లైన్‌లో లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.