Gold Rate Today: తెలంగాణ, ఏపీ నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే...
Gold Price Today:నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన గనరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Price Today: బడ్జెట్ ప్రవేశపెడుతూ బంగారం, వెండి కస్టమ్స్ డ్యూటీని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించగానే బంగారం భారీగా పతనమయ్యాయి. కొండెక్కి కూర్చొన్న ధరలు ఒక్కసారి నేల చూశాయి. దాదాపు 10వేల మేర తగ్గింది. అయితే గత రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. వచ్చేది శ్రావణమాసం కావడంతో బంగారం కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. నేపథ్యంలో బంగారంతోపాటు వెండికి కూడా గిరాకీ పెరిగింది. మరి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్ : హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 68,730గా ఉంది. వెండి కిలో 89,000
విజయవాడ: విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 70,300 ఉండగా 22క్యారెట్ల ధర రూ. 70,310గా ఉంది. వెండి కిలో 89,000
విశాఖ పట్నం: విశాఖలో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 68,750 ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,460 గా ఉంది. వెండి కిలో ధర రూ. 85,000
ఇక బంగారం స్వచ్ఛతను క్యారట్లలో కొలుస్తుంటారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ బంగారం స్వచ్చత ధర కూడా పెరుగుతుంది. మేలిమి బంగారాన్ని 24 క్యారెట్లుగా లెక్కిస్తారు. అంటే ఇది 99.9 స్వచ్చమైన బంగారం. ఇది కాయిన్స్ , బార్స్, బిస్కెట్ల రూపంలో ఉంటుంది.
-నగల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తారు. దీనిలో ఇతర లోహాలను వినియోగిస్తారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22 క్యారెట్లు 916స్వచ్చతతో ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో లెక్కిస్తారు.
-బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది. తగ్గితే తగ్గుతుంది.