Insurance: త్వరలో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలు ఒకే ప్లాట్‌ఫారమ్ కిందికి..!
Insurance: భారతదేశం వంటి పెద్ద దేశంలో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అత్యవసరం.
Insurance: భారతదేశం వంటి పెద్ద దేశంలో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అత్యవసరం. ఈ పరిస్థితిలో దేశంలోని సామాన్య, పేద వర్గాలకు బీమా సౌకర్యాలు చేరేలా బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (IRDAI) ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పుడు వేర్వేరు కంపెనీ ప్లాన్‌లను కొనుగోలు చేయడానికి వేర్వేరు వెబ్‌సైట్‌లను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని కంపెనీల పాలసీలు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో జతచేయనున్నారు.
ఐఆర్‌డీఏఐ బ్లూప్రింట్
దీనికోసం ఐఆర్‌డీఏఐ ఒక బ్లూ ప్రింట్‌ని సిద్దం చేసింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లోనే కస్టమర్‌లు అనేక బీమా కంపెనీల పాలసీలని పోల్చి చూడవచ్చు. దీంతోపాటు బీమాను క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా పొందుతారు. మీడియా నివేదికల ప్రకారం.. బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ ప్లాట్‌ఫారమ్ బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తోంది. సంవత్సరం చివరి నాటికి ఈ ప్లాట్‌ఫారమ్ రెడీగా ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రయోజనాన్ని పొందడానికి, బీమా ఏజెంట్లు ఇప్పుడు ఈ ప్లాట్‌ఫారమ్‌లో పేర్లని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ప్లాట్‌ఫారమ్ మొత్తం నియంత్రణ IRDAI చేతిలో ఉంటుంది. నేటికీ దేశంలో అధిక జనాభా బీమా తీసుకోని వారే ఉన్నారు. ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ నివేదిక ప్రకారం దేశంలోని 4.2% మంది ప్రజలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో బీమా పాలసీని కలిగి ఉన్నారు. ఇది 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 5.8% పెరుగుతుందని అంచనా. దీంతో ప్రజలు వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో బీమా పాలసీని తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకే ప్లాట్‌ఫారమ్‌లో వివిధ రకాల బీమా పాలసీలని చూడటం ద్వారా వాటిని సరిపోల్చగలడు. దీంతో ఏదైనా ఒక ప్లాన్‌ని సులభంగా కొనుగోలు చేసే సదుపాయం ఉంటుంది.