ఇన్సూరెన్స్ ఏజెంట్లకి శుభవార్త.. త్వరలో ఐఆర్‌డీఏఐ కొత్త నిర్ణయం..!
ఇన్సూరెన్స్ ఏజెంట్లకి శుభవార్త.. త్వరలో ఐఆర్‌డీఏఐ కొత్త నిర్ణయం..!
Insurance Agents: దేశవ్యాప్తంగా లక్షలాది జీవిత బీమా, సాధారణ బీమా పాలసీలను విక్రయిస్తున్న ఏజెంట్లకు ఇది శుభవార్తని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో జీవిత బీమా, సాధారణ బీమా కంపెనీల ఏజెంట్లు ఒకటి కంటే ఎక్కువ కంపెనీల పాలసీలను విక్రయించగలరు. త్వరలో బీమా నియంత్రణ సంస్థ (IRDAI) ఒక విభాగంలో ముగ్గురు ఏజెంట్ల నియమాన్ని ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు, ఏజెంట్స్ అసోసియేషన్ కూడా ఈ నిర్ణయానికి అనూకూలంగా ఉన్నాయి.
ఇటీవల బీమా నియంత్రణ సంస్థ IRDAI కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్ల కోసం నిబంధనలను సడలించింది. 9 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆమోదం తెలిపింది. బీమా పరిధిని మరింత పెంచేందుకు కంపెనీ ఒక ఏజెంట్‌ను ఒకటి కంటే ఎక్కువ బీమా కంపెనీలతో లింక్ చేస్తుంది. ఏజెంట్ కూడా కస్టమర్‌కు మరిన్ని మంచి ఎంపికలను అందించగలడు. అయితే బీమా నియంత్రణ సంస్థ IRDAI నాన్-లైఫ్ ఇన్సూరెన్స్‌లోని అన్ని విభాగాలకు కమీషన్‌ను 20%కి తగ్గించాలని ప్రతిపాదించింది. దీని కారణంగా వివిధ కంపెనీలు ఒకే రకమైన ఉత్పత్తులపై కమీషన్‌ను నిర్ణయించే అవకాశం ఉంది.
IRDAI వార్షిక నివేదిక ప్రకారం 2021 సంవత్సరం వరకు జీవిత బీమా రంగంలో 24 లక్షల 55 వేల మంది ఏజెంట్లు ఉన్నారు. ఆరోగ్య, సాధారణ బీమాలో మొత్తం ఏజెంట్ల సంఖ్య 14 లక్షల 22 వేలు ఉన్నారు. ప్రస్తుతం బీమా ఏజెంట్లు ఒకటి కంటే ఎక్కువ బీమా కంపెనీల పాలసీలను విక్రయించగలరు. రెగ్యులేటర్ ఒక విభాగంలో మూడు బీమా కంపెనీల ఏజెంట్లను ఆమోదించగలరు. త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.