IRCTC: బంపర్ ఆఫర్.. ఇంట్లో నుంచే సంపాదించే అవకాశం..!
IRCTC: మీరు ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే...
IRCTC: మీరు ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. దీని ద్వారా మీరు చాలా సంపాదిస్తారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు భారతీయ రైల్వే ద్వారా ఈ బిజినెస్ చేస్తారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా అందరు రైల్ టికెట్లు బుక్ చేసుకుంటారు. అంతేకాదు అనేక ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మీరు IRCTC సాయంతో ప్రతి నెలా వేల రూపాయలు సంపాదించవచ్చు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఆదాయం పొందగలుగుతారు. టిక్కెట్ ఏజెంట్‌గా మారితే సరిపోతుంది. ప్రతిఫలంగా మీరు నెలకు వేల రూపాయల వరకు సంపాదించగలరు.
తప్పనిసరిగా IRCTC ఏజెంట్ అయి ఉండాలి
రైల్వే కౌంటర్లలో క్లర్క్ టికెట్లు ఇచ్చిన మాదిరి మీరు కూడా ప్రయాణీకులకు టిక్కెట్లు తీసి ఇవ్వాలి. ఆన్‌లైన్‌లో టికెట్లను కట్ చేయడానికి మీరు IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించి ఏజెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత మీరు అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ అవుతారు. అప్పుడు ఇంట్లో కూర్చొని పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించగలరు. మీరు తత్కాల్, RAC మొదలైన అన్ని రకాల రైలు టిక్కెట్‌లను బుక్ చేయవచ్చు. టిక్కెట్లను బుకింగ్ చేయడంపై ఏజెంట్లు IRCTC నుంచి గణనీయమైన కమీషన్ పొందుతారు.
మీరు ప్రయాణీకుల కోసం నాన్ AC కోచ్ టికెట్లని బుక్ చేస్తే IRCTC నుంచి ఒక్కో టిక్కెట్‌కు రూ. 20, ఏసీ టిక్కెట్‌కు రూ. 40 కమీషన్ పొందుతారు. ఇది కాకుండా టిక్కెట్ ధరలో ఒక శాతం ఏజెంట్‌కు ఇస్తారు. అయితే IRCTC ఏజెంట్ కావడానికి కొంత రుసుము చెల్లించాలి. ఒక సంవత్సరానికి ఏజెంట్‌గా మారడానికి, IRCTC రుసుము రూ. 3999 చెల్లించాలి. మీరు రెండేళ్లపాటు ఏజెంట్‌గా మారాలనుకుంటే మీరు రూ. 6999 చెల్లించాలి.