Government Schemes: ఈ గవర్నమెంట్‌ స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తే డబ్బు రెట్టింపు.. అవేంటంటే..?

Government Schemes: కష్టపడి సంపాదించిన డబ్బును రెట్టింపు చేయడానికి మార్కెట్‌లో చాలా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ ఉన్నాయి. కానీ ఇందులో అన్ని నిజమైనవి కాదు.

Update: 2024-04-14 15:00 GMT

Government Schemes: ఈ గవర్నమెంట్‌ స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తే డబ్బు రెట్టింపు.. అవేంటంటే..?

Government Schemes: కష్టపడి సంపాదించిన డబ్బును రెట్టింపు చేయడానికి మార్కెట్‌లో చాలా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్‌ ఉన్నాయి. కానీ ఇందులో అన్ని నిజమైనవి కాదు. కొంతమంది అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి బిచాణా ఎత్తేస్తున్నా రు. అందుకే డబ్బును ఎప్పుడైనా ప్రభుత్వ భద్రత ఉన్న స్కీమ్‌లలో ఇన్వెస్ట్‌ చేయాలి. అలాం టి మూడు ప్రభుత్వ పథకాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కిసాన్ వికాస్ పత్ర

ఇందులో ప్రస్తుతానికి ఏడాదికి 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీలో డబ్బును ఇన్వెస్ట్‌ చేయడం వల్ల కొన్ని సంవత్సరాల్లో రెట్టింపు చేసుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్రలో కనీస పెట్టుబడి పరిమితి రూ. 1000. అదే సమయంలో గరిష్ట పెట్టుబడి ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఏకమొత్తం పెట్టుబడి పథకం. అంటే ఒక్కసారి మాత్రమే డబ్బు పెట్టి వదిలేయాలి. మళ్లీ మళ్లీ వాయిదాలలో డబ్బు జమ చేయాల్సిన అవసరం ఉండదు. మీ వడ్డీతో పాటు మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం కూడా పెరుగుతూనే ఉంటుంది. మీపెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. అంటే 9 సంవత్స రాల 7 నెలలు. ఉదా.. రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే ఈ సమయం తర్వాత రూ. 10 లక్షలు వస్తాయి. మీరు రూ. 4 లక్షలు డిపాజిట్ చేస్తే పైన పేర్కొన్న సమయం తర్వాత ఈ మొత్తం రూ. 8 లక్షలకు పెరుగుతుంది.

PPF (పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌)

పీపీఎఫ్‌పై ప్రస్తుతం వడ్డీ రేట్లు 7.1 శాతంగా ఉంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం పొదుపు చేయడంలో సాయపడుతుంది. ఈ పథకం పన్ను ఆదాలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో 72 నియమం ప్రకారం మీ డబ్బు రెట్టింపు కావడానికి 10 సంవత్సరాల కంటే తక్కువ సమయం పడుతుంది.

సుకన్య సమృద్ధి యోజన

సుకన్య సమృద్ధి యోజన కింద డిపాజిట్ చేసిన మొత్తంపై 8.2 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంది. పోస్టాఫీసు మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 7.1 శాతంగా ఉంది. సుకన్య సమృద్ధి (SSY) అనేది ప్రభుత్వ చిన్న పొదుపు పథకం. ఇది ఆడపిల్లల భవిష్యత్‌ కోసం చదువు, పెళ్లి ఖర్చులకు సాయపడుతుంది. ఈ పథకం 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుమార్తెలకు అందుబాటులో ఉంది. పథకం కింద, మీరు ఏడాదికి కనిష్టంగా రూ. 250, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు.

Tags:    

Similar News