Fixed Deposits: ఈ ఐదు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అత్యధిక వడ్డీ.. ఇంకా పన్ను రాయితీ..!
Fixed Deposits: ఈ ఐదు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అత్యధిక వడ్డీ.. ఇంకా పన్ను రాయితీ..!
Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లు సంప్రదాయ పెట్టుబడి సాధనాలు. వడ్డీ రేటు తగ్గడం వల్ల కొంతకాలంగా వీటిపై ఆసక్తి తగ్గింది. అయితే రెపో రేటు పెరిగినప్పటి నుంచి బ్యాంకులు టర్మ్ డిపాజిట్లపై అధిక రాబడిని అందిస్తున్నాయి . ఇది మరోసారి పెట్టుబడిదారులను ఆకర్షించడం ప్రారంభించింది. పన్ను ఆదా చేయడంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు బాగా ఉపయోగపడతాయి . అయితే దీని వ్యవధి కనీసం ఐదు సంవత్సరాలు ఉండాలి. తక్కువ కాల వ్యవధి FDలపై పన్ను మినహాయింపు ఉండదు.
రిజర్వ్ బ్యాంక్ రెండు వేర్వేరు దశల్లో రెపో రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. తరువాత చాలా బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచాయి. కొన్ని బ్యాంకులు టర్మ్ డిపాజిట్లపై 7.4 శాతం రాబడిని అందిస్తున్నాయి. ఈ రాబడి ద్రవ్యోల్బణాన్ని అధిగమించబోతోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7 శాతానికి చేరువలో ఉంది. ఈ పరిస్థితిలో వార్షిక రాబడి 7 శాతం కంటే తక్కువగా ఉంటే నికర ప్రాతిపదికన పెట్టుబడి తగ్గుతోంది.
1. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 42 నెలల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు అంటే 60 నెలల FDలపై 7.40 శాతం రాబడిని అందిస్తుంది. ఇందులో ఏడాదికి రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.2.16 లక్షలు వస్తాయి.
2. డచ్ బ్యాంక్ ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం రాబడిని అందిస్తుంది . ఇందులో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.2.12 లక్షలు వస్తాయి.
3. AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐదు సంవత్సరాల టర్మ్ డిపాజిట్లపై 6.90 శాతం వడ్డీని అందిస్తుంది . ఇందులో రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.2.11 లక్షలు వస్తాయి.
4. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6.75 శాతం రాబడిని ఇస్తుంది . ఐదు సంవత్సరాలు పూర్తయితే మొత్తం 2.09 లక్షల రూపాయలు పొందుతారు.
5. DCB బ్యాంక్ పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.6 శాతం వడ్డీని ఇస్తుంది. ఇందులో 1.5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఐదేళ్ల తర్వాత 2.08 లక్షల రూపాయలు వస్తాయి.