Investment Tips: బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. దీని కంటే అధిక రాబడినిచ్చే స్కీమ్‌ల గురించి తెలుసా..?

Investment Tips: భారతదేశంలో బంగారానికి చాలా డిమాండ్‌ ఉంటుంది. ధనిక, పేద తేడా లేకుండా వారి స్థాయికి బట్టి ఎంతో కొంత బంగారం కొంటూనే ఉంటారు.

Update: 2024-05-20 11:30 GMT

Investment Tips: బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా.. దీని కంటే అధిక రాబడినిచ్చే స్కీమ్‌ల గురించి తెలుసా..?

Investment Tips: భారతదేశంలో బంగారానికి చాలా డిమాండ్‌ ఉంటుంది. ధనిక, పేద తేడా లేకుండా వారి స్థాయికి బట్టి ఎంతో కొంత బంగారం కొంటూనే ఉంటారు. అలాగే చాలామంది బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితంగా భావిస్తారు. అందుకే ఎక్కువగా నగల రూపంలో భద్రపరుస్తారు. అయితే ఇన్వెస్ట్‌మెంట్ రకానికి వస్తే బంగారం కంటే అధిక లాభాలు ఇచ్చే చాలా స్కీమ్స్‌ మార్కెట్‌లో ఉన్నాయి. ఇవి కొంచెం రిస్క్‌తో కూడుకున్నవి కావొచ్చు. కానీ తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉంటాయి. అలాంటి స్కీమ్స్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బంగారంలో కంటే రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువగా సంపాదించవచ్చు. కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో విపరీతమైన లాభాలు వస్తున్నాయి. ఇందులో మూలధనం విలువ కచ్చితంగా పెరుగుతుంది. అయితే భూముల విలువ అనేది ఎల్లప్పుడూ పెద్ద నగరాలతో ముడిపడి ఉంటుంది. అలాగే నగరాలలో అయితే అపార్ట్‌మెంట్స్‌ నిర్మించి అద్దెకివ్వడం వల్ల కూడా మంచి లాభాలు సంపాదించవచ్చు. దీని విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి.

నేటి ఆధునిక కాలంలో చాలామంది స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారు. గత పదేళ్లలో స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. ఇందులో పెట్టుబడి పెడితే రిస్క్‌ ఉంటుందని అందరికి తెలుసు. అయినప్పటికీ చాలామంది రిస్క్‌ని తట్టుకుని ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చు.

అలాగే రిస్క్‌ తక్కువగా తీసుకునేవారు మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. దీర్ఘకాలం లో ఇందులో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఇక ఎలాంటి రిస్క్‌ తీసుకోనివారు, తమ డబ్బుకు రక్షణ ఉండాలనుకునే వారు గవర్నమెంట్‌ బాండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇవన్నీ బంగారంతో పోల్చితే మంచి రాబడి అందిస్తాయి.

Tags:    

Similar News