SBI: ఎస్బీఐ ఖాతాదారులకి స్పెషల్ ఆఫర్.. ఈ స్కీంలో పెట్టుబడి పెడితే నెల నెలా రాబడి..!

SBI: ఎస్బీఐ ఖాతాదారులకి స్పెషల్ ఆఫర్.. ఈ స్కీంలో పెట్టుబడి పెడితే నెల నెలా రాబడి..!

Update: 2022-03-29 13:30 GMT

SBI: ఎస్బీఐ ఖాతాదారులకి స్పెషల్ ఆఫర్.. ఈ స్కీంలో పెట్టుబడి పెడితే నెల నెలా రాబడి..!

SBI Annuity Deposit Scheme: ప్రజలు పొదుపు ద్వారా తమ భవిష్యత్‌ని సురక్షితంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తారు. కానీ కొన్నిసార్లు తప్పుడు స్కీంలలో పెట్టుబడి పెట్టి డబ్బులు పోగొట్టుకుంటారు. ఈ పరిస్థితిలో వారు తమ డబ్బుకి భద్రత ఉన్న చోట పెట్టుబడి పెడితే మంచి రాబడి సంపాదించగలరు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం అలాంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరు యాన్యుటీ డిపాజిట్‌ పథకం.

యాన్యుటీ పథకం లక్షణాలు

1. SBI అన్ని శాఖల నుంచి యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

2. యాన్యుటీ పథకంలో కనీసం 25 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

3. SBI ఉద్యోగులు, మాజీ ఉద్యోగులకు 1 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది.

4. సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం ఎక్కువ వడ్డీ చెల్లిస్తారు.

5. టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఈ స్కీమ్‌పై వర్తిస్తాయి

6. వచ్చే నెల డిపాజిట్ చేసిన తేదీ నుంచి యాన్యుటీ చెల్లిస్తారు.

7. ఒకేసారి పెద్ద మొత్తంలో మంచి రాబడి పొందడానికి మెరుగైన ప్రణాళిక

9. ఆపద సమయాల్లో యాన్యుటీ మొత్తంలో 75% వరకు ఓవర్‌డ్రాఫ్ట్ / లోన్ పొందవచ్చు.

10. పొదుపు ఖాతా యాన్యుటీ స్కీమ్‌ మెరుగైన రాబడిని అందిస్తుంది.

SBI ఈ పథకంలో 36, 60, 84 లేదా 120 నెలల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడిపై వడ్డీ రేటు టర్మ్ డిపాజిట్లకు సమానంగా ఉంటుంది. మీరు ఐదేళ్లపాటు నిధులను డిపాజిట్ చేస్తే ఐదేళ్లపాటు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి వర్తించే వడ్డీ రేటుతో మీకు వడ్డీ లభిస్తుంది. భారతదేశ పౌరులు ఎవరైనా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఒక పెట్టుబడిదారుడు ప్రతి నెలా 10 వేల రూపాయల నెలవారీ ఆదాయం పొందాలనుకుంటే దాని కోసం 5 లక్షల 7 వేల 965 రూపాయల 93 పైసలు డిపాజిట్ చేయాలి. మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై 7 శాతం వడ్డీ రేటును తిరిగి పొందుతారు. దీని కారణంగా పెట్టుబడిదారు ప్రతి నెలా దాదాపు 10 వేల రూపాయలు సంపాదిస్తారు. కాబట్టి మీ దగ్గర అంత పెద్ద మొత్తం ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు.

Tags:    

Similar News