Investment Ideas: 30 ఏళ్లలోపు వీటిలో ఇన్వెస్ట్‌ చేయండి.. భవిష్యత్‌లో ఊహించని ప్రయోజనాలు..!

Investment Ideas: ద్రవ్యోల్భణం కారణంగా నేటి రోజులలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి.

Update: 2023-08-10 15:00 GMT

Investment Ideas: 30 ఏళ్లలోపు వీటిలో ఇన్వెస్ట్‌ చేయండి.. భవిష్యత్‌లో ఊహించని ప్రయోజనాలు..!

Investment Ideas: ద్రవ్యోల్భణం కారణంగా నేటి రోజులలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీంతో డబ్బులు పొదుపు చేయడం చాలా కష్టమవుతుంది. అందుకే చిన్నవయసులోనే పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకోవాలి. 30 ఏళ్ల లోపు కొన్నిటిలో పెట్టుబడులు పెట్టడం వల్ల రిటైర్మెంట్‌ వరకు పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. భవిష్యత్‌ తరాలకి మార్గనిర్దేశం చేయవచ్చు. అలాంటి ఇన్వెస్ట్‌మెంట్‌ ఐడియాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

జీవిత బీమా

చిన్న వయస్సులోనే జీవిత బీమా చేస్తే మెచ్యూరిటీ ప్రయోజనం, మరణ ప్రయోజనం రెండింటినీ పొందుతారు. దీంతో పాటు దీర్ఘకాలిక రాబడులని పొందుతారు. చిన్న వయస్సులోనే జీవిత బీమా చేయడం వల్ల తక్కువ ప్రీమియం మాత్రేమే ఉంటుంది. కానీ లాభాలు అధికంగా ఉంటాయి.

షేర్ మార్కెట్

చిన్న వయసులోనే షేర్లను కొనుగోలు చేయాలి. ధీర్ఘకాలంలో అవి మంచి రాబడిని అందిస్తాయి. అలాగే మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేయాలి. వీటిలో తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు.

స్థిరాస్తి

ఆస్తుల ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. ఈ పరిస్థితిలో 30 సంవత్సరాల వయస్సు వరకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా భవిష్యత్తులో మంచి ప్రయోజనాలని పొందుతారు. అధిక డబ్బుని సంపాదిస్తారు.

బంగారం కొనుగోలు

భారతదేశంలో బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. పండుగల సమయంలో అమ్మకాలు ఇంకా పెరుగుతాయి. అయితే బంగారం ధర నిరంతరం పెరుగుతుండటంతో ఇందులో పెట్టుబడులు పెట్టాలి. 30 ఏళ్లలోపు బంగారంపై ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్‌లో మంచి రాబడులు పొందుతారు.

Tags:    

Similar News