Investment Plans: చిన్న వయసులో పెట్టుబడి పెట్టండి.. భారీ ఆదాయాన్ని సంపాదించండి..!

Investment Plans: మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి స్కీంలు, ప్లాన్‌లు చాలా ఉన్నాయి.

Update: 2023-07-08 12:30 GMT

Investment Plans: చిన్న వయసులో పెట్టుబడి పెట్టండి.. భారీ ఆదాయాన్ని సంపాదించండి..!

Investment Plans: మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడానికి స్కీంలు, ప్లాన్‌లు చాలా ఉన్నాయి. కానీ అవి సరైన విధానంలో ఎంచుకునే అవగాహన కలిగిఉండాలి. నేటి రోజుల్లో డిజిటలైజేషన్‌ వల్ల స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం సులభతరం అయింది. కరోనా కాలంలో స్టాక్ మార్కెట్‌లో చాలా డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. కానీ బాగా సంపాదించాలనుకునేవారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కారణం అవగాహన లోపమే. సరైన పెట్టుబడి ప్రణాళిక వేసుకున్న వారు మాత్రం మంచి లాభాలు పొందుతున్నారు. కొందరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (SIP) ద్వారా పెట్టుబడి పెడుతున్నారు.

సులభంగా లక్షాధికారి

స్టాక్ మార్కెట్‌లో అన్ని రకాల ఇన్వెస్టర్లు ఉంటారు. కొంతమంది డబ్బు పెట్టుబడి పెడితే వెంటనే పదిరెట్లు లాభం పొందుతామని భావిస్తారు. ఒక్క పెట్టుబడితో కోట్లాది రూపాయల రాబడి రావాలని కోరుకుంటారు. కానీ ఇది సాధ్యంకాదు. ఇందులో సంపాదించాలంటే చాలా ఓపిక అవసరమవుతుంది. నిపుణుల సలహాలు పాటించాలి. సరైన వయస్సులో పెట్టుబడి పెట్టినట్లయితే మంచి ప్రయోజనం పొందవచ్చు. లేదంటే భారీ నష్టాలని చవిచూడాల్సి ఉంటుంది.

20 నుంచి 30 ఏళ్లలో

చిన్న వయస్సులో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం 20 నుంచి 30 సంవత్సరాల వయస్సులో ఈక్విటీలో 100 శాతం పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇది దీర్ఘకాలిక పెట్టుబడిగా ఉండాలి. తద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చు. 30 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నవారు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే 5 నుంచి 7 సంవత్సరాల అనుభవం ఉండాలి. అప్పుడే మంచి రాబడులు పొందుతారు. దీనికి పోర్ట్‌ఫోలియోలో మార్పు అవసరమవుతుంది. ఈ వయస్సులో డబ్బు మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే పద్ధతిని మార్చుకోవాలి. కొంత డబ్బును లోన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకోసం నిపుణుల సలహాలు పాటించాలి.

50 ఏళ్ల తర్వాత

చాలా మంది ఈ వయసులో రిటైర్మెంట్ కోసం ఎదురుచూస్తారు. ఏ పెట్టుబడిదారుడు పెద్ద రిస్క్ తీసుకోలేడు. అలాంటప్పుడు 65-75% డెట్ మ్యూచువల్ ఫండ్లలో, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. వృద్ధాప్యంలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు సొంత పరిశోధన, అభిప్రాయాన్ని తీసుకోవడం అవసరం. అలాగే రిస్క్‌ని తగ్గించడానికి మెరుగైన రాబడిని పొందడానికి పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు పాటించాలని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News