EPFO Alert: ఈపీఎఫ్‌వో అలర్ట్.. త్వరలో 6 కోట్లమందికి ప్రయోజనం..!
EPFO Alert: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో ఖాతాదారులకి వడ్డీ ప్రయోజనం అందజేయనుంది.
EPFO Alert: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో ఖాతాదారులకి వడ్డీ ప్రయోజనం అందజేయనుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సభ్యులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఈ సంవత్సరం ఖాతాదారులకు 8.1 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది గత 40 ఏళ్లలో చాలా తక్కువ. దాదాపు 6 కోట్ల మంది ప్రజల ఖాతాలకు ప్రభుత్వం వడ్డీ సొమ్మును జమచేయనుంది. ఈ పరిస్థితిలో పీఎఫ్ ఖాతాలో వడ్డీ డబ్బుల గురించి తెలుసుకోవడానికి ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని బ్యాలెన్స్‌ని సులభంగా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
ఉమాంగ్ యాప్‌తో సులభంగా బ్యాలెన్స్‌ని చెక్ చేయవచ్చు. ముందుగా UMANG యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత రిజిస్టర్ చేసుకుని పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ ఆప్షన్‌ను ఎంచుకోండి. తర్వాత UAN నంబర్, OTPని ఎంటర్ చేయండి. అంతే మీ పీఎఫ్ బ్యాలెన్స్ సులభంగా తెలిసిపోతుంది. అంతేకాదు PF బ్యాలెన్స్‌ని కేవలం ఒక మిస్డ్ కాల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు కాల్ చేయాలి. రెండు రింగ్‌ల తర్వాత కాల్ కట్ అవుతుంది. తర్వాత మీ మొబైల్ నంబర్‌కు SMS వస్తుంది. అందులో మీ ఖాతాకు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది.
ఇది కాకుండా మీ బ్యాలెన్స్‌ని SMS ద్వారా తనిఖీ చేయవచ్చు. దీని కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO UAN ENG అని టైప్ చేయడం ద్వారా 7738299899కి SMS పంపవచ్చు. మీరు కేవలం కొన్ని నిమిషాల్లో PF ఖాతా బ్యాలెన్స్ సమాచారాన్ని పొందుతారు. అంతేకాకుండా మీరు EPFO అధికారిక పోర్టల్‌ని సందర్శించండి. ఇక్కడ అవర్ సర్వీసెస్ ఎంపికను ఎంచుకోండి. ఇందులోని ఉద్యోగుల కోసం ఎంపికను క్లిక్ చేయండి. తర్వాత సభ్యుని పాస్‌బుక్, UAN నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్‌బుక్ కొన్ని నిమిషాల్లో స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇది మీ PF బ్యాలెన్స్ సమాచారాన్ని కలిగి ఉంటుంది.