Insurance Alert: ఇన్సూరెన్స్‌ అలర్ట్‌.. లాప్స్ అయిన పాలసీలపై మోసాలు..!

Insurance Alert: ఇన్సూరెన్స్‌ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Update: 2022-12-01 16:00 GMT

Insurance Alert: ఇన్సూరెన్స్‌ అలర్ట్‌.. లాప్స్ అయిన పాలసీలపై మోసాలు..!

Insurance Alert: ఇన్సూరెన్స్‌ ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే చాలామంది చాలా పాలసీలు తీసుకుంటారు. ఇవి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి సహాయంచేస్తాయి. అయితే ప్రతి ఇన్సూరెన్స్‌ పాలసీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఒక్కోసారి సరైన సమయంలో ప్రీమియం చెల్లించలేకపోతారు. దీని కారణంగా ఆ పాలసీలు ల్యాప్స్ అవుతాయి. అయితే ఇలా ల్యాప్స్‌ అయిన పాలసీలపై మోసాలు జరుగుతున్నాయి.

ల్యాప్స్ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు సంబంధించిన మోసాలు పెరుగుతున్నాయి. ఈ పాలసీలను పునరుద్ధరిస్తామని పాలసీదారులకు మోసపూరిత కాల్‌లు వస్తున్నాయి. చాలా మంది ఇన్సూరెన్స్‌ హోల్డర్లు ఇలాంటి ఫేక్ కాల్స్ వలలో చిక్కుకుని ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. వీటిని నివారించడానికి ప్రజలు పాలసీకి సంబంధించిన ప్రీమియంను క్రమం తప్పకుండా చెల్లించాలి. ఏ పాలసీ ల్యాప్ అవ్వకుండా చూసుకోవాలి. పాలసీ ల్యాప్ అయినట్లయితే దానిని మళ్లీ పునరుద్ధరించడానికి నేరుగా ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ను సంప్రదించాలి.

పాలసీని పునరుద్ధరించడానికి నకిలీ కాల్స్‌ని గుర్తించి వాటిని నివారించాలి. ఇలాంటి కాల్స్‌ చేసేవారు కొంత మొత్తం చెల్లించి కొత్త బీమా పాలసీని తీసుకుంటే ల్యాప్స్ అయిన పాలసీ కూడా రికవరీ అవుతుందని చెబుతారు. అంతేకాదు పాలసీదారులని మభ్యపెడుతారు. ఈ పరిస్థితిలో ఇటువంటి కాల్స్‌కి స్పందించకూడదు. ఏదైనా అనుమానం వస్తే ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ని కానీ కార్యాలయాన్ని కానీ సంప్రదించాలి.

Tags:    

Similar News